Advertisement

Advertisement


Home > Politics - Andhra

జేడీ మళ్ళీ ఆ పార్టీ చెంతకేనట...?

జేడీ మళ్ళీ ఆ పార్టీ చెంతకేనట...?

ఆయన సీబీఐ మాజీ జేడీ. ఆ విధంగా బాగానే పాపులారిటీ సంపాదించారు. ఇక కొంతకాలం మహరాష్ట్ర క్యాడర్ లో పనిచేసి 2019 ఎన్నికల ముందు స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు. 2019 ఎన్నికల్లో జనసేనను పవన్ కళ్యాణ్ ని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. బాగానే ఓట్లు రాబట్టుకున్నా ఓటమి పలుకరించింది.

దాంతో ఆయన కొంతకాలం జనసేనలో ఉన్నా కూడా విధానాలు నచ్చలేదని రాజీనామా చేశారు. ఈ మధ్య ఆయన మళ్లీ విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తాను అని ప్రకటించారు. అయితే ఏ రాజకీయ పార్టీ అన్నది మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. అయితే ఆయన మరోసారి జనసేన నుంచే ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు.

ఆయన అధికార వైసీపీలో చేరరు, టీడీపీలో చేరాలనుకున్నా ఎందుకో కుదరదు అనే చెబుతున్నారు. మిగిలింది చూస్తే జనసేన అనే అంటున్నారు. ఆ పార్టీకి కూడా జేడీ లాంటి క్యాండిడేట్ మళ్ళీ వచ్చి చేరితే మంచిదేనట. అయితే ఇక్కడ జేడీ తానుగా వెళ్ళి పవన్ తో మాట్లాడితే సమస్య పరిష్కారం అయి ఆయన రీ జాయినింగ్ కి నో అబ్జెక్షన్ అని అంటున్నారు.

అన్ని ఆప్షన్లు సీరియస్ గా పరిశీలిస్తున్న జేడీ ఒక దశలో బీజేపీ అనుకున్నారు కానీ చివరిని తాను అడుగుపెట్టిన మొదటి పార్టీతోనే రాజకీయ ప్రయాణం చేస్తేనే మేలు అని ఆలోచిస్తున్నారుట. జేడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంటే విశాఖ ఎంపీ సీటులో పోటీ చేసేది ఆయనే అంటున్నారు. పొత్తులో ఉంటే టీడీపీ ఈ సీటు వదులుకోవాల్సిందే అని అంటున్నారు. ఈ విషయాలు ఎలా ఉన్నా భూమి గుండ్రంగా ఉంది అని జనసేనలో మళ్ళీ చేరి జేడీ తొందరలోనే నిరూపిస్తారు అని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?