Advertisement

Advertisement


Home > Politics - Andhra

విశాఖకు ఒకేసారి జగన్ కేసీఆర్

విశాఖకు ఒకేసారి జగన్ కేసీఆర్

ఇద్దరు తెలుగు సీఎంలు ఒకేసారి ఒకే చోట కలవబోతున్నారు. విశాఖలోని శ్రీ శారదాపీఠంలో జరిగే రాజశ్యామల యాగంలో పాలుపంచుకోవడానికి ఇప్పటికే ఏపీ సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా పీఠం వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు ఇపుడు తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్నారని ప్రచారం సాగుతోంది. రాజశ్యామల యాగాలను ఇప్పటికే పలుమార్లు చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీని ప్రారంభించారు. ఈ జాతీయ పార్టీకి మంచి ఆదరణ దేశవ్యాప్తంగా లభించాలని ఆయన కోరుకుంటున్నారు.

కేసీఆర్ ని కూడా శారదాపీఠం పెద్దలు ఆహ్వానించడంతో రాజశ్యామల అమ్మవారి ఆశీర్వాదం కోసం ఆయన వస్తున్నారని, యాగంలో ఆసాంతం ఆయన పాలుపంచుకుంటారు అని అంటున్నారు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి విశాఖ వస్తారని సమాచారం ఉండడంతో అధికారులతో పాటు పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. శారదాపీఠంలో ప్రత్యేకమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు

పీఠానికి వీవీఐపీల తాకిడి ఉన్న నేపధ్యంలో పరిసరాలలో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. విశాఖకు ఒకేసారి జగన్ కేసీఆర్ వస్తారన్న సమాచారం రాజకీయ వర్గాలలో సంచలనంగా మారుతోంది. ఈ ఇద్దరు సీఎం లు చాలా కాలంగా ముఖాముకీ భేటీ కాలేదు. శారదాపీఠంలో కనుక వారు కలిస్తే అది దేశవ్యాప్తంగానే ఆసక్తికరమైన వార్త అవుతుంది అని అంటున్నారు. 

శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామికి ఈ ఇద్దరూ అతి ముఖ్య అతిధులు కావడంతో పిలుపు అందుకుని వస్తున్నారు అని పీఠం వర్గాలు తెలియచేస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్ ని విస్తరిస్తాలని చూస్తున్న కేసీఆర్ జగన్ తో ప్రత్యేకంగా ముచ్చటిస్తారా అన్న దాని మీద ఊహాగానాలు సాగుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?