Advertisement

Advertisement


Home > Politics - Andhra

న‌గ్న బుర‌ద‌లోనే పొర్లాడాల‌ని...!

న‌గ్న బుర‌ద‌లోనే పొర్లాడాల‌ని...!

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వ్య‌వ‌హారాన్ని టీడీపీ రాజ‌కీయంగా వాడుకునే క్ర‌మంలో మిగిలిన అన్ని విష‌యాల్ని ప‌క్క‌న పెట్టింది. ఇందులో టీడీపీకి ఒన‌గూరే ప్ర‌యోజ‌నాల సంగ‌తేమో కానీ, జ‌నం మాత్రం అస‌హ్యించుకుంటున్నారు. ఆ వీడియోతో టీడీపీ శున‌కానందాన్ని పొందుతోంద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మాధ‌వ్ వ్య‌వ‌హారాన్ని పౌర స‌మాజం ఛీత్క‌రించుకుంటోంది.

అలాగ‌ని ఆ వీడియోను అడ్డు పెట్టుకుని టీడీపీ చేస్తున్న న‌గ్న రాజ‌కీయాల్ని ప్ర‌జ‌లు హ‌ర్షించే ప‌రిస్థితిలో లేరు. ఒక‌వైపు న్యూడ్ వ్య‌వ‌హారంపై మాట్లాడేందుకు సిగ్గుగా వుందంటూనే ముసిముసి న‌వ్వులు న‌వ్వుతూ టీడీపీ ఎంపీలు త‌మ వికృత మ‌న‌స్త‌త్వాన్ని బ‌య‌ట పెట్టుకుంటున్నారు.

మాధ‌వ్ వ్య‌వ‌హారం క‌మ్మ‌, కుర‌బ కుల గొడ‌వ‌ల‌కు దారి తీసింది. అంటే వ్య‌వ‌హారం ప‌క్క‌దారి ప‌ట్టింది. అలాగే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్ర‌బాబు ఉదంతాన్ని వైసీపీ తెర‌పైకి తెచ్చింది. బ్రీఫ్‌డ్ మి అంటూ చంద్ర‌బాబు అన్న మాటలు మార్ఫింగా, కాదా? అని ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చేందుకు ఏడేళ్లు స‌రిపోలేదా? అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఎంపీలు మీడియా ముందుకొచ్చి మాధ‌వ్ వ్య‌వ‌హారంపై మ‌రోసారి మాట్లాడారు. మాధ‌వ్‌పై లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేసిన‌ట్టు ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు తెలిపారు.

మాధ‌వ్‌పై చ‌ర్య‌లు తీసుకుంటే ఆ పార్టీకి చెందిన స‌గానికి స‌గం మంది ఎంపీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని వైసీపీ భ‌య‌ప‌డుతోంద‌న్నారు. వైసీపీ నేత‌ల్లో చాలా మందిపై అత్యాచార కేసులున్న‌ట్టు ఎన్నిక‌ల అఫిడ‌విట్లో చూశామ‌న్నారు. ఎన్నిక‌ల అఫిడ‌విట్లు దాప‌రికం కాదు. అలాంట‌ప్ప‌డు ఎవ‌రెవ‌రిపై అత్యాచార కేసులున్నాయో వివ‌రిస్తే స‌రిపోతుంది. ఊరికే ఆరోప‌ణ‌లు చేయ‌డం వ‌ల్ల నిజాలు కూడా న‌మ్మ‌లేని ప‌రిస్థితి త‌లెత్తుతుంది.

ఈ విష‌యాన్ని టీడీపీ ఎంపీలు ఎందుకు గ్ర‌హించ‌డం లేదో అర్థం కావ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఏ విష‌య‌మైనా అతి చేస్తే... చివ‌రికి రివ‌ర్స్ అవుతుంది. సిగ్గుమాలిన ఎపిసోడ్‌కు సంబంధించి మాధ‌వ్‌పై చ‌ర్య‌ల‌ను వైసీపీ విచక్ష‌ణ‌కు వ‌దిలేసి, ముఖ్య‌మైన ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడితే టీడీపీకే మంచిది. కాదు కూడ‌ద‌ని ఆ న‌గ్న బుర‌ద‌లోనే పొర్లాడాల‌ని టీడీపీ భావిస్తుంటే చేయ‌గ‌లిగేదేమీ వుండ‌దు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?