Advertisement

Advertisement


Home > Politics - Andhra

మాధ‌వ్ వీడియోకి ఏ మాత్రం తీసిపోని రీతిలో!

మాధ‌వ్ వీడియోకి ఏ మాత్రం తీసిపోని రీతిలో!

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దూరం పెట్టార‌ని ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ తెగ బాధ‌ప‌డిపోతోంది. ఎంత‌లా అంటే జ‌గ‌న్‌కే మాధ‌వ్ ముఖం చాటార‌ని చెప్పే వ‌ర‌కూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా వెళ్లాయి. వాళ్ల ఆవేద‌న అర్థం చేసుకోవాల్సిందే.

మాధ‌వ్ న్యూడ్ వ్య‌వ‌హారం దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ వ్య‌వ‌హారంపై విచారిస్తున్న‌ట్టు ఏపీ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఫోరెన్సిక్ నివేదిక‌ను బ‌ట్టి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఇప్ప‌టికే హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.  

ఈ నేప‌థ్యంలో నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశంలో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లారు. జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లే ముందు... సీఎంను మాధ‌వ్ త‌ప్ప‌క క‌లుస్తార‌ని, ఎక్క‌డ‌నేది ఇంకా తెలియ‌లేద‌ని ఎల్లో మీడియా ఊద‌ర‌గొట్టింది. త‌ద్వారా మాధ‌వ్‌కు జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇస్తున్నార‌నే సంకేతాల్ని జ‌నంలోకి పంపాల‌నే ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ ఎల్లో మీడియా, టీడీపీ ఆశించిన‌ట్టు జ‌గ‌న్‌ను మాధ‌వ్ క‌ల‌వ‌లేదు. మ‌ళ్లీ కొత్త వాద‌న‌ను తెర‌పైకి తెచ్చి తమ శున‌కానందాన్ని ప్ర‌ద‌ర్శించాయి.  

జ‌గ‌న్‌కు మాధ‌వ్ ముఖం చాటేశాడ‌ని చెప్ప‌డం అంటే... అంత‌కు మించిన‌ దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? అనే ప్ర‌శ్న లొస్తున్నాయి. గోరంట్ల‌ను జ‌గ‌న్ క‌లిస్తే ఒక‌లా, క‌ల‌వ‌క‌పోతే మ‌రోలా ...మొత్తానికి ముఖ్య‌మంత్రిని టార్గెట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా దుర్మార్గ క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేయ‌డం ఎల్లో మీడియాకే చెల్లింది. మాధ‌వ్ న‌గ్న వీడియోకు. ఎల్లో రాత‌ల‌కు అస‌భ్య‌త‌లో ఏ మాత్రం వ్య‌త్యాసం లేద‌నేందుకు వైసీపీ అధినేత కేంద్రంగా రాస్తున్న క‌థ‌నాలే నిద‌ర్శ‌నం.

మాధ‌వ్ వెకిలి చేష్ట‌ల‌ను ఎవ‌రైనా స‌మ‌ర్థిస్తారా? చంద్ర‌బాబైనా, జ‌గ‌న్‌బాబైనా, మ‌రో నేత ఎవ‌రైనా ఇలాంటి వ్య‌వ‌హారాల‌ను స‌హించే ప్ర‌శ్నే ఉండ‌దు. ఏదో ర‌కంగా జ‌గ‌న్‌ను అప్ర‌తిష్ట‌పాలు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌చ్చ బ్యాచ్ విమ‌ర్శ‌లు, లాజిక్ లేని వాద‌న‌ల‌తో అభాసుపాల‌వుతోంది.

మాధ‌వ్ న‌గ్న వీడియోకు ఏ మాత్రం త‌క్కువ కాని రీతిలో జుగుప్స క‌లిగించే క‌థ‌నాల‌ను జ‌గ‌న్‌పై వండివార్చ‌డంలో ఎల్లో మీడియా త‌ల‌మున‌క‌లైంది. ఇందులో టీడీపీ త‌న వంతు పాత్ర పోసిస్తోంది.

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను