Advertisement

Advertisement


Home > Politics - Andhra

పాదయాత్ర మానుకుంటే బెటర్

పాదయాత్ర మానుకుంటే బెటర్

ఇది ఉత్తరాంధ్రా యువ మంత్రి, వైసీపీలో పెద్ద నోరు ఉన్న మంత్రి అయిన గుడివాడ అమరనాధ్ చెబుతున్న మాట. ఆయన బాధ్యత కలిగిన మంత్రిగానే ఈ మాట చెబుతున్నారు అనుకోవాలి. ఎందుకంటే ఏపీలోని వివిధ ప్రాంతాల మధ్య విద్వేషాలు ఎవరికీ మంచివి కావు అని గుడివాడ అంటున్నారు. ఇది అందరికీ మేలు చేసే నిర్ణయంగా ఉంటుందని గుడివాడ అభిప్రాయపడుతున్నారు.

అమరావతికే అభివృద్ధి కావాలని, రాజధాని అక్కడే ఉండాలని, విశాఖ మీదుగా పాదయాత్ర చేయడం అంటే స్థానికుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా. ఇదే విషయాన్ని ఆయన చెబుతున్నారు. పైగా ఈ పాదయాత్ర రాజకీయ యాత్రగా కూడా ఆయన చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని సీఎం చేయాలని కూడా ఈ యాత్ర వెనక ఉన్న అసలు ఉద్దేశ్యమని ఆయన అంటున్నారు. విశాఖ మీద చంద్రబాబుకు ఎలాంటి ప్రేమ లేదని, అందుకే ఇలా రాజకీయం చేయిస్తున్నారని గుడివాడ మండిపడ్డారు. జగన్ కి విశాఖ అభివృద్ధి మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటి అన్నది తాజాగా ఒక సంఘటన చెబుతోందని పరిశ్రమల మంత్రి చెప్పారు.

ఈ మధ్యనే టాటా టాటా గ్రూపు చైర్మన్ సీఎం ని కలసినపుడు విశాఖలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని జగన్ ఆయన్ని కోరారని గుడివాడ తెలియచేశారు. విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల వెనకబాటుతనం రూపుమాపడానికి దార్శనీకుడు అయిన జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చారని, ఇదే విషయాన్ని తాము గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు వివరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?