Advertisement

Advertisement


Home > Politics - Andhra

అశోక్ కూతురి గెలుపు గీత ఆమె చేతిలో?

అశోక్ కూతురి గెలుపు గీత ఆమె చేతిలో?

విజయనగరం వంశీకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు తన రాజకీయ వారసురాలిగా కుమార్తె అదితి గజపతిరాజుని ముందుకు తెచ్చారు. ఆమెకు 2019లో టికెట్ ఇప్పించుకుంటే జగన్ వేవ్ లో ఓటమి పాలు అయ్యారు. 2024లో కూడా ఆమెకే టికెట్ దక్కించుకునేలా పావులు కదిపారు.

దాంతో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వర్గం రగిలిపోతోంది. ఆమె తనకు టికెట్ దక్కుతుందని ఆశించారు. 2014లో ఆమె ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆమెకు నాడు కేంద్ర మంత్రిగా విజయనగరం ఎంపీగా ఉన్న అశోక్ నుంచి సహాయ నిరాకరణ జరిగిందని అంటారు.

గీతను ఒక ఎమ్మెల్యేగా పని చేయనీయకుండా అశోక్ వర్గీయులు చేశారని ఆమె అధికారాలను కత్తిరించి నియంత్రించారని అంటారు. ఒక దశలో అశోక్ వర్సెస్ గీతగా విజయనగరం టీడీపీలో పొలిటికల్ వార్ నడిచింది.  దాంతో 2019లో గీతకు టికెట్ దక్కలేదు. 2024లో గీతకే టికెట్ అని టీడీపీ హై కమాండ్ చెప్పి తీరా సరైన సమయానికి హ్యాండ్ ఇచ్చింది. అశోక్ వత్తిడితో ఇదంతా జరిగిందని మీసాల గీత వర్గం మండిపడుతోంది

తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే చాన్స్ పార్టీ ఇవ్వకపోవడంతో మీసాల గీత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు విజయనగరంలో తూర్పు కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన గీత తాను పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాను అని భవిస్తున్నారు.

అయితే ఆమె పోటీ వల్ల అశోక్ కూతురు అదితి విజయావకాశాలు బాగా తగ్గిపోతాయని అంటున్నారు. తూర్పు కాపులు బీసీలు గీతకు మద్దతుగా నిలబడితే ఈ పోరులో వైసీపీకే చాన్స్ ఉంటుందని అంటున్నారు. గీత పోటీ అనివార్యం అయిన నేపధ్యంలో ఆమెను పోటీకి దూరంగా ఉంచేందుకు టీడీపీ పెద్దలు ఏమి చేస్తారో తెలియదు. తన రాజకీయ భవిష్యత్తు కోసం గీత వేస్తున్న ఈ అడుగులు రాజా వారి మూడవ తరం రాజకీయ గీతనే మారుస్తాయని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?