Advertisement

Advertisement


Home > Politics - Andhra

విశాఖలో మంకీ పాక్స్...?

విశాఖలో మంకీ పాక్స్...?

విశాఖలో మంకీ పాక్స్ కేసు ఒకటి వచ్చినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. హైదారాబాద్ నుంచి వచ్చిన 22 ఏళ్ళ యువకుడికి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లుగా ప్రైమరీ టెస్ట్ లో  వైద్యాధికారులు గుర్తించారు. ఆ యువకుడు మెడికోగా పేర్కొంటున్నారు. ఆయనకు  విశాఖలోని ఒక ప్రైవేట్ విద్యా సంస్థలోని ఆసుపత్రిలో చికిత్స అందించారు.

ఆ యువకుడికి మంకీ పాక్స్ లక్షణాలు పూర్తిగా ఉన్నాయా అని నిర్ధారించేందుకు ఆంధ్రా మెడికల్ కళాశాల వైద్యులు అక్కడికి వెళ్ళేలోపే ఆ యువకుడు పరార్ అయ్యాడు. దాంతో ఇపుడు అధికారులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఆ యువకుడి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

నిజానికి మంకీ పాక్స్ కేసులు దేశంలో కొన్ని నమోదు అయ్యాయి. వీటి వల్ల మొదటి దశలో పెద్దగా ప్రమాదం లేదని భావిస్తున్నా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం కచ్చితంగా అది డేంజరే అని కూడా అంటున్నారు. 

ఈ నేపధ్యంలో ఇతర నగరాల నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారి విషయంలో అధికారులు చాలా  జాగ్రత్తగా ఉంటున్నాడు. ప్రస్తుతం విశాఖలో పరారైన మెడికోకి కనుక మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నాయి. అతడు కొసం వేట మొదలైంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?