Advertisement

Advertisement


Home > Politics - Andhra

టీడీపీ కూటమిలో విశాఖ ముసలం!

టీడీపీ కూటమిలో విశాఖ ముసలం!

తెలుగుదేశం కూటమి ఏ ముహూర్తాన కట్టిందో తెలియదు కానీ ఎక్కడ లేని కష్టాలు వచ్చిపడి కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాదాపుగా అన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లకు కూటమిలోని మూడు పార్టీలూ అభ్యర్ధులను ప్రకటించినా అసంతృప్తి స్వరాలు మూడు పార్టీలలో చూస్తే పతాక స్థాయికి చేరుకున్నాయి.

నామినేషన్ల స్వీకరణకు చాలా గడువు ఉండడంతో అభ్యర్ధులను అవసరం అయిన చోట ఎందుకు మార్చరాదు అన్న డిమాండ్ కూటమి పార్టీల నుంచి వస్తోంది. విశాఖ ఎంపీ సీటు బీజేపీకే ఇవ్వాలని తాజాగా ఆ పార్టీ స్థానిక నాయకత్వం డిమాండ్  చేస్తోంది. విశాఖ నగర బీజేపీ శాఖ ఈ మేరకు ఒక తీర్మానాన్ని చేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించింది.

విశాఖతో బీజేపీకి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు అని అందులో పేర్కొంది. దక్షిణ భారత దేశంలో మొదటి కార్పోరేషన్ ని విశాఖలోనే బీజేపీ 1980లో గెలుచుకుంది అని అందులో గుర్తు చేశారు. విశాఖలో పెద్ద ఎత్తున కార్పోరేటర్లు ఎపుడూ గెలుస్తూ వస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు విశాఖ నుంచే బీజేపీ గెలుచుకుందని పేర్కొంటున్నారు.

గత కొంతకాలంగా విశాఖ సిటీలో బీజేపీ ఓటు బ్యాంక్ భారీగా పెరిగిందని అలాంటి చోట ఎంపీ సీటు పొత్తులో కేటాయించకపోవడం దారుణం అని అంటున్నారు. పునరాలోచన చేసి విశాఖ ఎంపీ సీటు బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.

దీంతో కూటమిలో కొత్త చిచ్చు రాజుకుంటోంది. ఇప్పటికే టీడీపీ కూటమి అభ్యర్ధిగా ఆ పార్టీ తరఫున శ్రీ భరత్ పేరు ప్రకటించారు. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తనకు సీటు రాకపోవడానికి కొన్ని కుటుంబాలు కారణం అని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు బండ వేశారు. ఆయన తనకు జరిగిన అన్యాయం మీద ఈ రోజుకీ కేంద్ర పెద్దల వద్ద చెప్పుకుంటున్నారు న్యాయం చేయాలని కోరుతున్నారు.

చంద్రబాబు కొన్ని చోట్ల అభ్యర్ధులను మారుస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. అలాంటిది విశాఖ ఎంపీ సీటుకు అభ్యర్ధిని ఎందుకు మార్చరని అంటున్నారు. బీజేపీకి సీటు ఇవ్వకపోవడంతో తాము కూటమికి ఓటు వేయమని నార్త్ ఇండియన్ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. అనకాపల్లి ఎంపీ బీజేపీకి నాన్ లోకల్ కాండిడేట్ కి ఇవ్వడం వల్ల అక్కడ కూడా ముసలం బయల్దేరింది. ఇవన్నీ ఇపుడు కూటమిలో సరికొత్త సమస్యలను తెస్తున్నాయని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?