Advertisement

Advertisement


Home > Politics - Andhra

బిగ్‌బాస్ రియాల్టీ షోను ర‌ద్దు చేసే వ‌ర‌కూ....త‌గ్గేదే లే!

బిగ్‌బాస్ రియాల్టీ షోను ర‌ద్దు చేసే వ‌ర‌కూ....త‌గ్గేదే లే!

బిగ్‌బాస్ రియాల్టీ షోపై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ ఘాటు వ్యాఖ్య‌లు కొన‌సాగుతూనే వున్నాయి. గ‌తంలో ఆయ‌న బిగ్‌బాస్ హౌస్‌ను బ్రోత‌ల్ హౌస్‌గా అభివ‌ర్ణించడం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. హోస్ట్ నాగార్జున‌పై కూడా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు, అశ్లీల‌త‌, అస‌భ్య‌త‌కు మారుపేరుగా నిలిచిన బిగ్‌బాస్ రియాల్టీ షోను బ్యాన్ చేయాలంటూ ఆయ‌న న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు.

బిగ్‌బాస్ రియాల్టీ షో 11 వారాలు పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఆ షోపై ఆయ‌న తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బిగ్‌బాస్ రియాల్టీ షో సాంఘిక దురాచారం లాంటిద‌ని తీవ్ర వ్యాఖ్య చేశారు. ఈ రియాల్టీ షోను ర‌ద్దు చేసేంత వ‌ర‌కూ త‌న పోరాటం ఆగ‌ద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఈ రియాల్టీ షోను ర‌ద్దు చేయాల‌ని తెలంగాణ‌లో ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌న్నారు. తెలంగాణ హైకోర్టు ఈ కేసును స్వీక‌రించ లేద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఏపీ హైకోర్టు కేసు స్వీక‌రించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. రియాల్టీ షోను ర‌ద్దు చేసేంత వ‌ర‌కూ న్యాయ‌పోరాటం సాగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ప్ర‌ధానంగా బిగ్‌బాస్ రియాల్టీ షో అశ్లీల‌త‌ను పెంచి పోషిస్తోంద‌ని ఆయ‌న ఆవేద‌న‌. ఈ రియాల్టీ షోను సామాజిక రుగ్మ‌త‌గా అభివ‌ర్ణించారంటే ఆయ‌న ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే నారాయ‌ణ విమ‌ర్శ‌ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?