Advertisement

Advertisement


Home > Politics - Andhra

నారాయణ ముచ్చట తీరింది....ఆ ప్రచారం తప్పేనా...?

నారాయణ ముచ్చట తీరింది....ఆ ప్రచారం తప్పేనా...?

విశాఖలోని రుషికొండను చూడాలనుకుని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముచ్చట పడ్డారు. ఆయన గత ఆగస్టులో అక్కడికి వెళ్తే పోలీసులు అడ్డుకుని రానీయలేదు. దాంతో ఆయన రుషికొండ మీద కట్టడాలని చూడడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. అలా కోర్టు అనుమతించడంతో ఆయన ఈ రోజు రుషికొండ నిర్మాణాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా నారాయణ చెప్పిన అసలు నిజం వింటే విపక్షాలు షాక్ తినాల్సిందే. రుషికొండ మీద ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ ఆఫీసు వంటివి కట్టేస్తున్నారని, మొత్తానికి మొత్తం రుషికొండను ముఖ్యమంత్రి ఆక్రమించేసుకున్నారని టీడీపీ సహా ఇతర పార్టీలు విమర్శించాయి.

తీరా నారాయణ అక్కడికి వెళ్ళి చూసి వచ్చి చెప్పిన సంగతులు ఏంటి అంటే ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించిన నిర్మాణాలు ఏవీ అక్కడ జరగడంలేదు అని. అంటే ఇన్నాళ్ళు దీని మీద టీడీపీ సహా విపక్షాలు చేసిన ప్రచారానికి బదులు ఏమిస్తారు అని వైసీపీ నేతలు అంటున్నారు.

అక్కడ కేవలం టూరిజం శాఖ ఆద్వర్యంలో భవనాల నిర్మాణం జరుగుతోందని, టూరిస్టులు అక్కడికి వస్తే వారు రాత్రి బస చేసేందుకు అత్యాధికంగా వీటిని నిర్మిస్తున్నార్ అని నారాయణ మాటల ద్వారా తెలిసింది. నారాయణ మాత్రం రుషికొండ మీదనే ఎందుకు అలాంటి భవనాలు నిర్మించడం, బయట ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కదా వాటిలో నిర్మిస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు.

విశాఖలో ఎన్నో భూములు ఉండగా రుషికొండ సహజత్వాన్ని దెబ్బతీయడం తగదని ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. దాన్ని పక్కన పెడితే ఇంతకాలం రుషికొండను జగన్ సొంతం చేసుకున్నారని, ఆయన ఏదో చేసేస్తున్నారని విమర్శలు చేసిన టీడీపీ నాయకులు ఇపుడు ఏమంటారు అని వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న. ఏమీ లేని దానికి కూడా అన్నీ అల్లి విమర్శలు చేశారని కూడా అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?