Advertisement

Advertisement


Home > Politics - Andhra

అగ్రవర్ణాలను దూరం పెట్టిన జగన్!

అగ్రవర్ణాలను దూరం పెట్టిన జగన్!

‘అగ్రవర్ణాల్లో కనీసం కులానికొక్కటి ఇచ్చి ఉంటే బాగుండేది కదా..’ ఇదీ జగన్ మంత్రివర్గం కూర్పు తర్వాత వినిపిస్తున్న మాట. ఈ మాట మాత్రమే కాదు.. ‘అగ్రవర్ణాలంటే రెడ్లు మాత్రమేనా’ అనే విమర్శ కూడా వినిపిస్తోంది. 

ఎందుకంటే.. జగన్ కొత్త కేబినెట్ కూర్పులో అగ్రవర్ణాల నుంచి నలుగురు రెడ్డి సామాజికవర్గం వారున్నారు. అదే సమయంలో అగ్రవర్ణాలకు చెందిన నాలుగు కులాలనుంచి అసలు ప్రాతినిధ్యమే లేదు. మూడు కులాలకు చెందిన వారు గత కేబినెట్లో ఉన్నారు గానీ.. ఈ దఫా ఆ మాత్రం కూడా వారికి ప్రాతినిధ్యం దక్కలేదు. 

ఒక కులానికి గతంలో గానీ, ఈ దఫా గానీ ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. ఒకటి రెండు ఇతర అగ్రకులాలకు ప్రాతినిధ్యం ఉన్నా.. ప్రధానమైన నాలుగు కులాలకు చోటు లేకపోవడం చర్చనీయాంశమే అవుతోంది. 

కమ్మ వర్గం నుంచి గతంలో కొడాలి నాని ఉండేవారు. ఆయనకు ప్రమాణ స్వీకారానికి ముందురోజు ప్రత్యామ్నాయం చూపించిన జగన్మోహన్ రెడ్డి.. మిగిలిన వారి గురించి ఆ మాత్రం కూడా పట్టించుకోలేదు. 

వైశ్య వర్గం నుంచి గత కేబినెట్లో ఉన్న వెలంపల్లి శ్రీనివాసరావు స్థానంలో అదే కులం నుంచి కోలగట్ల వీరభద్ర స్వామికి అవకాశం తప్పకుండా దక్కుతుందని అందరూ చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయనను డిప్యూటీ స్పీకరు చేసి.. అసలు కేబినెట్ లో ఆ కులానికి చోటు లేకుండా చేశారు. క్షత్రియ సామాజికవర్గం నుంచి గత కేబినెట్లో ఉన్న  శ్రీరంగనాథ రాజు స్థానం కూడా ఆ కులం నుంచి భర్తీ కాలేదు. బ్రాహ్మణులకు అప్పుడూ ఇప్పుడూ కూడా చోటు లేదు.

నిజానికి కాపు వర్గం నుంచి నలుగురు మంత్రులున్నారు. తూర్పుకాపు, శెట్టి బలిజ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఉంది. అయితే తాము బీసీలుగానే ఉండాలని భావిస్తున్న కాపులను పక్కన పెడితే.. కొత్త కేబినెట్లో అగ్రవర్ణాల ప్రాధాన్యం బాగా తగ్గినట్టే. నలుగురు రెడ్లు, ఒక్క వెలమ మాత్రం కనిపిస్తున్నారు. 

అగ్రవర్ణాలను చిన్నచూపు చూసినట్టు కనిపిస్తున్నా.. కాపు, బీసీ, ఎస్సీ వర్గాల్లో అమితమైన కీర్తిని గడించడాన్ని జగన్ ఈ మంత్రివర్గ కూర్పు ద్వారా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి పక్కన పెట్టిన అగ్రవర్ణాల నుంచి పార్టీలో కొనసాగుతున్న నాయకుల్లో పెద్దగా అసంతృప్తి రేగకపోవచ్చు గానీ.. ఆయన సామాజిక వర్గాల ప్రజల్లో ఇద బాధ కలిగించదా అనే చర్చ మొదలవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?