Advertisement

Advertisement


Home > Politics - Andhra

అంద‌రికీ ద‌త్త తండ్రి ఎలా వ‌స్తారు ప‌వ‌న్‌?

అంద‌రికీ ద‌త్త తండ్రి ఎలా వ‌స్తారు ప‌వ‌న్‌?

తూర్పు కాపు నాయ‌కుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌నసేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ప‌వ‌న్ త‌న అజ్ఞానాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట పెట్టుకుంటూనే వుంటార‌నేందుకు ఈ స‌మావేశ‌మే నిద‌ర్శ‌న‌మని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. తూర్పు కాపు నాయ‌కుల స‌మావేశంలో ప‌వ‌న్ ఏమ‌న్నారంటే....

"రాజ‌కీయాల్లో మ‌నోధైర్యం కావాలి. అది ఉన్న‌వారే రాజ‌కీయాలు చేయ‌గ‌ల‌రు. అది వున్న బీసీ నాయ‌కుడిని ప్రోత్స‌హించండి. డ‌బ్బులు అక్క‌ర్లేదు. నేను రూ.కోట్లు లేకుండానే రాజ‌కీయాలు చేస్తున్నా. 2008 నుంచి దెబ్బ‌లు తిని వున్నా. ఓడిపోయినా బ‌లంగా నిల‌బ‌డ్డా. స‌మ‌స్య‌ల‌పై మాట్లాడి ఎద‌గాలి. జ‌న‌సేన అలా ఎదిగిన పార్టీ"

కోట్లాది రూపాయ‌లు లేకుండానే రాజ‌కీయాలు చేస్తున్న‌ట్టు ప‌వ‌న్ చెప్ప‌డంపై నెటిజ‌న్లు పంచ్‌లు విసురుతున్నారు. మీ పార్టీని న‌డిపేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు డ‌బ్బు మూట‌లు పంపే ద‌త్త తండ్రి చంద్ర‌బాబు ఉన్న‌ట్టు, అంద‌రికీ ఎలా వ‌స్తారు ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారూ అని నెటిజ‌న్లు ప్ర‌శ్నించ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఓడిపోయినా బ‌లంగా నిల‌బ‌డ‌డం ఏంటో ప‌వ‌న్‌కే తెలియాల‌ని నెటిజ‌న్లు అంటున్నారు. స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన ఎప్పుడు మాట్లాడిందో క‌నీసం ఆయ‌న‌కైనా గుర్తుందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత‌కూ జ‌న‌సేన ఎదిగింద‌ని ప‌వ‌న్ ఏ ప్రాతిపదిక‌న చెబుతున్నారో కాస్త వివ‌రిస్తే మంచిద‌ని హిత‌వు చెబుతున్నారు. 

మ‌రీ ముఖ్యంగా బీసీల ఓట్లు చీల‌నివ్వొద్ద‌ని తూర్పుకాపు నాయ‌కుల స‌మావేశంలో ప‌వ‌న్ అన‌డం విడ్డూరంగా ఉంద‌నడం గ‌మ‌నార్హం. బీసీల‌ను విడ‌గొట్టి కేవ‌లం తూర్పు కాపుల‌తోనే స‌మావేశం ఏర్పాటు చేసిన ప‌వ‌న్‌... మీలో మీరు విడిపోయి మ‌న‌ల్ని మ‌న‌మే ప‌లుచ‌న చేసుకోవ‌ద్ద‌ని కోర‌డం ఆయ‌న‌కే చెల్లింద‌ని విమ‌ర్శిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌ను అజ్ఞానిగా ప‌వ‌న్ అభివ‌ర్ణించ‌డంపై కూడా సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. 

ఒక అజ్ఞాని రాజ‌కీయాలు చేయ‌డం చేత‌కాక 151 సీట్లు గెలుచుకున్న నాయ‌కుడికి తెలివి లేద‌న‌డం ప‌వ‌న్ మాన‌సిక స్థితిని తెలియ‌జేస్తోంద‌ని కామెంట్స్ చేయ‌డం విశేషం. 2024 నుంచి రెండు ఎన్నిక‌ల్లో మీరు బ‌లంగా నిలిస్తే ఈ రాష్ట్ర భ‌విష్య‌త్ బీసీల చేతిలో వుంటుంద‌ని, లేక‌పోతే కొద్ది మందే ఆధిప‌త్యం చెలాయిస్తారని హెచ్చ‌రిస్తున్న ప‌వ‌న్‌... ఇంత‌కూ తాను ఎవ‌రి ప‌ల్ల‌కీ మోయ‌డానికి రాజ‌కీయం చేస్తున్నారో చెబితే బాగుంటుంద‌నే ప్ర‌శ్న వెల్లువెత్తుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?