Advertisement

Advertisement


Home > Politics - Andhra

న‌వ్విపోతారు ప‌వ‌న్‌... స‌ర్దుబాటు చేయ‌డానికి తిరుప‌తికా?

న‌వ్విపోతారు ప‌వ‌న్‌... స‌ర్దుబాటు చేయ‌డానికి తిరుప‌తికా?

తిరుప‌తిలో జ‌న‌సేన అభ్య‌ర్థి ఆర‌ణి శ్రీ‌నివాసులుకు సొంత పార్టీతో పాటు టీడీపీ, బీజేపీ నాయ‌కులంద‌రి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు శుక్ర‌వారం సాయంత్రం తిరుప‌తికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెళ్ల‌నున్నారు. నిజానికి అక్క‌డ ఎలాంటి స‌మ‌స్యా లేదు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అస‌మ‌ర్థుడ‌ని ప‌సిగ‌ట్టే సొంత పార్టీ నాయ‌కులు అల‌క న‌టిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు సుగుణ‌మ్మ జ‌న‌సేన‌కు ఏ మాత్రం స‌హ‌క‌రించలేద‌నేది వాస్త‌వం.

ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడు శ్రీ‌కాళ‌హ‌స్తి ప‌ర్య‌ట‌న‌లో తిరుప‌తి టీడీపీ నాయ‌కుల‌కు చాలా స్ప‌ష్టంగా జ‌న‌సేనకు స‌హ‌క‌రించాల‌ని ఆదేశించారు. అయిన‌ప్ప‌టికీ సుగుణ‌మ్మ ప‌ట్టించుకోలేదు. ఎందుకంటే సుగుణ‌మ్మ‌, ఆర‌ణి శ్రీ‌నివాసులు మ‌ధ్య భూవివాదం వుంది. ప‌ర‌స్ప‌రం కేసుల వ‌ర‌కూ వెళ్లారు. అందుకే ఆర‌ణి అంటే... సుగుణ‌మ్మ ఆగ్ర‌హంతో ఎగిరెగిరి ప‌డుతున్నారు. ఎవ‌రి బాధ వారిది.

ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిరుప‌తికి వ‌చ్చి ఎవ‌రిని స‌ముదాయించాల‌నేదే ప్ర‌శ్న‌. బీజేపీ నేత‌లు స‌హ‌క‌రిస్తున్నారు. సొంత పార్టీ నాయ‌కులైన ఒక‌రిద్ద‌రిని బుజ్జ‌గించ‌డానికి తిరుప‌తికి వెళ్లాల‌ని అనుకోవ‌డ‌మే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. చంద్ర‌బాబు ఆదేశిస్తే... ప‌ట్టించుకోని సుగుణ‌మ్మ‌తో ప‌వ‌న్ మాట్లాడే ప‌రిస్థితి వుంటుందా?  కులం, పార్టీల కంటే ఆర్థిక వ్య‌వ‌హారాలు మ‌నుషుల్ని డామినేట్ చేస్తాయి.

ఇప్పుడు ఆర‌ణి, సుగుణ‌మ్మ మ‌ధ్య స్థ‌లాలు, వాటికి సంబంధించి కోట్లాది రూపాయ‌ల ఆర్థిక వ్య‌వ‌హారం అయిన‌ప్పుడు ప‌వ‌న్ ఏం చేయ‌గ‌ల‌ర‌నే ప్ర‌శ్న స‌హ‌జంగానే ఉత్ప‌న్న‌మ‌వుతోంది. తిరుప‌తికి వ‌చ్చి ఏ మాత్రం అంద‌రినీ తాటిపైకి తెస్తారో చూడాలి. మొత్తానికి ప‌వ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న కూట‌మిలో ఉత్కంఠ రేపుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?