Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఎన్నిక‌ల కోసం జనసేనలోకి రావద్దు!

ఎన్నిక‌ల కోసం జనసేనలోకి రావద్దు!

సినీ హీరో, జ‌న‌సేన రాజ‌కీయ పార్టీ అధ్య‌క్షుడు ఎప్పుడూ మీడియా ముందు మాట్లాడినా కొత్త‌గా ఉంటుంది. ఏం మాట్లాడుతాడో, ఎలా ఉంటారో అయ‌న‌కే తెలియ‌దు. నోటికి వ‌చ్చింది మాట్లాడ‌టం మ‌ళ్లీ త‌న షెడ్యూల్ అయిపొగానే ఫాం హౌస్ లో రెస్ట్ తీసుకుంటూ జ‌నాల మ‌ధ్య‌లో పార్ట్ టైమ్ పొలిటిషన్ గా పేరు తెచ్చుకున్నారు.

చాల కాలం త‌ర్వాత‌ పొలిటిక‌ల్ మీటింగ్ కు కాల్ షీట్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ అఫీసులో ఐటీ విభాగం రాష్ట్ర స్థాయి స‌ద‌స్సు నిర్వ‌హించిన మీటింగ్ లో మాట్లాడుతూ ఒక త‌రాన్ని మేల్కొల్ప‌డానికి, అందరికీ బాధ్య‌తల‌ను గుర్తు చేయ‌డానికే పార్టీ పెట్టాన‌ని స‌రికొత్త మాట చెప్పారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ త‌ను చ‌దివిన వేల పుస్త‌కాల్లో నుండి ఒక గొప్ప విష‌యం చెప్తు, 'ఫ్రీడ‌మ్ ఫ‌ర్ మిడ్ నైట్' పుస్త‌కాన్ని చ‌దివాక దేశం కోసం ఏదైనా ఆలోచ‌న వ‌చ్చింద‌ని గొప్ప నిజం చెప్పారు. రాబోయే త‌రాల‌కు బాధ్య‌త తెల‌ప‌డానికే జ‌న‌సేన పెట్టారంటా. ఒక ఎన్నిక కోస‌మే అయితే ఎవ‌రూ జ‌న‌సేన‌లోకి రావ‌ద్దు అంటూ జ‌న‌సైనికుల‌కు చెప్పారు. ప‌ద‌వి మ‌నల్ని వెతుక్కుంటు రావాలి.. మ‌నం దాని వెంట ప‌డ‌కూడదు అని జ‌న‌సైనికుల‌ను దృష్టిలో పెట్టుకొని చెప్పారు. బ‌హుశ ప‌వ‌న్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయడం కూడా ఇష్టం లేన‌ట్లుంది.

జగన్‌వి అమలుకు సాధ్యంకాని హామీలు అని జగన్ పాలనా తీరుపై పవన్ విరుచుకుపడ్డారు. అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారని ఆరోపించారు. మ‌రి చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు ప్ర‌శ్నించలేదు. జ‌గ‌న్ త‌ను ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చెప్పిన హామీలే ఇప్పుడు నేర‌వేరుస్తున్నారు. హామీలు నెర‌వేరుస్తుంటే అప్పులు చేసి ప్ర‌జ‌ల‌కు పంచుతున్నారు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు విమ‌ర్శిస్తున్నారు. పేద‌ల‌కు ఉచిత‌ ప‌థ‌కాలు అందిస్తుంటే అది చూసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రో శ్రీలంక అవుతుంద‌ని మరో వైపు విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కే సాధ్యం.

చంద్ర‌బాబు స్కీప్ట్ ఫాలో అవ్వ‌డం మాని సొంత అలోచ‌న‌ల‌తో ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఉంటే గెల‌వ‌క‌పోయిన క‌నీసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఒక రాజ‌కీయ నాయ‌కుడిగా అయినా గుర్తిస్తారు. కార్య‌క‌ర్త‌ల‌కు సొంత అజెండాతో ముందుకు వెల్లనిస్తే కాస్తో కూస్తో ఓట్లు వ‌స్తాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?