Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌గ‌న్‌పై ద్వేషం లేదు... ఊరూవాడా చెప్పండ‌య్యా!

 జ‌గ‌న్‌పై ద్వేషం లేదు... ఊరూవాడా చెప్పండ‌య్యా!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌ల‌కు, చేత‌ల‌కు అస‌లు పొంత‌న వుండ‌దు. చేతిలో మైకు, ఎదురుగా జ‌నం వుంటే ఆయ‌న అదుపు త‌ప్పుతుంటారు. ఏం మాట్లాడుతున్నారో త‌న‌కే తెలియ‌కుండానే ఊగిపోతుంటారు. ముఖ్యంగా సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై ద్వేషంతో ర‌గిలిపోతూ, ఆయ‌న్ను ఎలాగైనా ఓడించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో మొద‌టి నుంచి ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాలు చేస్తార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

అయితే జ‌గ‌న్‌పై విషం చిమ్మ‌డం కాస్త శ్రుతి మించింద‌ని ఆయ‌న గ్ర‌హించిన‌ట్టున్నారు. దీని వ‌ల్ల త‌న‌కు రాజ‌కీయంగా న‌ష్ట‌మే త‌ప్ప‌, ఒన‌గూరే ప్ర‌యోజ‌నం లేద‌ని ఆయ‌న ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న‌ట్టుగా వుంది. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌గిరిలో జ‌న‌సేన కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో ప‌వ‌న్ ప్ర‌సంగిస్తూ త‌న‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ఎలాంటి వ్య‌క్తిగ‌త ద్వేషం లేద‌న్నారు. త‌న‌ను న‌మ్మాల‌ని ఆయ‌న వేడుకున్నారు.

జ‌గ‌న్‌పై ద్వేషం లేద‌నే వాస్త‌వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక జ‌న‌సేన నాయ‌కులు జ‌నం దృష్టికి తీసుకెళ్లాల‌ని ప‌వ‌న్ కోర‌డం విశేషం. నోరు తెరిస్తే జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం త‌ప్ప‌, మ‌రెవ‌రిపై ఒక్క మాట కూడా మాట్లాడ‌ని వైనాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. జ‌గ‌న్‌పై ద్వేషం లేద‌ని మాట‌ల్లో చెప్పడం కాదు, చేత‌ల్లో చూపిన‌ప్పుడే ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని ప‌వ‌న్ గ్ర‌హించాలి.

జ‌గ‌న్ అవినీతిపై ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. జ‌గ‌న్ అవినీతిపై తాను అస‌లు మాట్లాడ‌న‌ని చెప్పుకొచ్చారు. అవినీతిపై జ‌నానికి పెద్ద‌గా ప‌ట్టింపు లేద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లే అవినీతి గురించి ప‌ట్టించుకోన‌ప్పుడే, జ‌గ‌న్ గురించి విమ‌ర్శ‌లు చేయ‌డం మాట వృథా అన్నారు. అవినీతికి పాల్ప‌డనివాళ్లెవ‌ర‌నే ప్ర‌శ్న ప్ర‌జ‌ల నుంచి ఎదుర‌వుతోంద‌న్నారు. అందుకే వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ దోపిడీ గురించి మాత్ర‌మే విమ‌ర్శ‌లు చేస్తున్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?