Advertisement

Advertisement


Home > Politics - Andhra

ప‌వ‌న్ ..ముచ్చటగా మూడు ఆప్షన్లు!

ప‌వ‌న్ ..ముచ్చటగా మూడు ఆప్షన్లు!

జ‌న‌సేన పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఇట్లే ఉంటుంది. ఎందుకంటే తానే మాట్లాడుతున్నాడు అనేది పక్క వారికీ  అర్థం కాకపోయినా పర్వాలేదు. కానీ తాను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే. ఒక్కసారి ఏమో పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళితే తాను వీరమరణం పొందుతానని తానే చెబుతాడు. మరోసారి ఏమో పొత్తులు కుదరకపోతే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తానని చెప్తారు.

తాజాగా తన ప్రచార రథానికి దేవుని పూజ కార్యక్రమంలో పాల్లోని.. కార్య‌క్ర‌మం ముగించుకుని మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పొత్తులపై మరో కొత్త మాట చెప్పారు. పొత్తులపై మూడు ఆప్షన్ కూడా ప్ర‌క‌టించారు. ఒకటి.. ప్రస్తుతం బిజెపితో పొత్తుతో ఉన్నాం కాబట్టి బిజెపితో కొనసాగడం. రెండు.. బిజెపి కాదంటే ఒంటరిగా వెళ్లడం. మూడు.. కొత్త వారితో పొత్తులకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బహుశా కొత్త పొత్తులంటే తన అత్యంత సన్నిహితుడు చంద్రబాబుతో పొత్తుకు వెళ్లడం.

దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ నాయ‌కుల‌కు, ప్ర‌జ‌ల‌కు ముందే తెలుసు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ- జ‌న‌సేన క‌లిసి వెళ్త‌య‌ని.. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు ఆప్ష‌న్లు అంటూ స‌రికొత్త రాగం ఎత్తుకుంటున్నారు. బ‌హుశా ప‌వ‌న్ చెప్పిన‌ట్లే ఎన్నిక‌ల‌కు కొన్ని వారాలకు ముందే పొత్తులపై స్పష్టత ఉంటుందేమో. అప్ప‌టి వరకు పవన్ చెప్పేది వినాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?