Advertisement

Advertisement


Home > Politics - Andhra

పాద‌యాత్ర‌పై లోకేశ్‌కు స్పెష‌ల్ క్లాస్‌లు

పాద‌యాత్ర‌పై లోకేశ్‌కు స్పెష‌ల్ క్లాస్‌లు

వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 27 నుంచి టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేశ్ పాద‌యాత్ర మొద‌లు పెట్ట‌నున్నారు. ముఖ్యంగా ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి, సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర కేంద్రంగా లోకేశ్ పాద‌యాత్ర జ‌ర‌గ‌నుంది. అన్నింటిలోనూ జ‌గ‌న్ పాద‌యాత్ర కంటే లోకేశ్ పాద‌యాత్ర అద్భుతం అనిపించేలా చేస్తేనే రాజ‌కీయ ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని టీడీపీ భావ‌న‌. అందుకే జ‌గ‌న్‌ను మించిపోయేలా 4 వేల కిలోమీట‌ర్లు లోకేశ్ పాద‌యాత్ర చేసేలా నిర్ణ‌యించారు.

ఈ నేప‌థ్యంలో జగ‌న్‌లా జ‌నాన్ని ఆక‌ట్టుకోవ‌డం ఎలా? అనేది పెద్ద స‌మ‌స్య‌గా త‌యారైంది. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌తి ఒక్క‌ర్నీ ద‌గ్గ‌రికి తీసుకుని ఆత్మీయంగా మాట్లాడ్డం రాజ‌కీయంగా ఆయ‌న‌కు లాభించింది. జ‌గన్‌ను ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్లో మ‌నిషిలా చూశారు. జ‌గ‌న్ కూడా అదే రీతిలో జ‌నంతో మ‌మేకం అయ్యారు. ఆయా వ‌య‌సుల‌ను బ‌ట్టి వ‌రుస‌ల‌తో పిల‌వ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

అక్కా, అన్నా, త‌మ్ముడు, అవ్వా, తాత‌, అమ్మా అంటూ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ పిల‌వ‌డం తెలిసిందే. అలా పిల‌వ‌డం రాయ‌ల‌సీమ సంస్కృతి. రాయ‌ల‌సీమ‌లో పుట్టి పెరిగిన జ‌గ‌న్‌కు ఆ ప్రాంత సంస్కృతి, సంప్ర‌దాయాల‌తో బ‌ల‌మైన బంధాన్ని ఏర్ప‌ర‌చుకున్నారు. అచ్చ‌మైన రాయ‌ల‌సీమలో యాస‌లో మాట్లాడ్డం కూడా జ‌గ‌న్‌కు క‌లిసొచ్చింది. కానీ లోకేశ్ ప‌రిస్థితి అందుకు పూర్తి భిన్నం.

చంద్ర‌బాబునాయుడిది రాయ‌ల‌సీమ అయిన‌ప్ప‌టికీ, మాన‌సికంగా ఆ ప్రాంతంతో క‌నెక్ట్ కాలేక‌పోయారు. ఇక త‌న‌యుడికి సీమ‌తో బంధం ఎలా ఏర్ప‌డుతుంది? లోకేశ్‌కు స‌హ‌జంగా జ‌నంతో ఆత్మీయంగా మ‌మేకం అయ్యేంత సీన్ లేదు.

ఒక‌వేళ జ‌గ‌న్‌ను చూసి తాను కూడా అవ్వా, అక్కా అని పిల‌వాల‌ని అనుకున్నా... కృత్రిమంగా వుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పాద‌యాత్ర‌లో జ‌నాన్ని ఆక‌ట్టుకునేందుకు ఎలా ప్ర‌వ‌ర్తించాల‌నే అంశంపై హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా క్లాస్‌లు తీసుకుంటున్నార‌ని స‌మాచారం. 

చిన్న‌పిల్ల‌లు, మ‌హిళ‌లు, యువ‌తీయువ‌కులు, వృద్ధులు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికుల‌తో ఎలా మెల‌గాలో లోకేశ్‌కు కొంద‌రు వ్య‌క్తిత్వ వికాస నిపుణులు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే... జ‌గ‌న్ పాద‌యాత్ర వీడియోల‌ను ప‌దేప‌దే చూస్తున్న‌ట్టుగా తెలిసింది. 

జ‌గ‌న్‌లా ఆత్మీయంగా ముద్దులు పెట్ట‌డం, త‌ల నిమ‌ర‌డం, జ‌నం చేతులు ప‌ట్టుకుని న‌డ‌వ‌డం...ఇలా అనేక అంశాల్లో జ‌గ‌న్‌ను ఫాలో కావ‌డ‌మే మంచిద‌ని లోకేశ్‌కు వ్య‌క్తిత్వ వికాస నిపుణులు సూచించిన‌ట్టు స‌మాచారం. లోకేశ్ పాద‌యాత్ర చివ‌రికి పులిని చూసి న‌క్క వాత పెట్టుకున్న క‌థ‌ను త‌ల‌పిస్తోందా? లేదా? అన్న‌ది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?