Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఇన్ని యాత్రలు చేస్తూ.. సర్కారుపై నిందలా? హవ్వ!

ఇన్ని యాత్రలు చేస్తూ.. సర్కారుపై నిందలా? హవ్వ!

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను ఎలా చేస్తారో? పూర్తిచేస్తారో లేదో తర్వాతి సంగతి. కానీ.. ఊరూవాడా మాత్రం ఆయన యువగళానికి భజన కార్యక్రమాలు హోరెత్తిపోయాయి. సరిగ్గా పాదయాత్ర ప్రారంభించడానికి నాలుగురోజుల ముందు నారాలోకేష్ బర్త్ డే రావడంతో.. తెలుగుదేశం నాయకులు రాష్ట్రమంతా పండగ చేసుకున్నారు. కేక్ లు కట్ చేశారు. రాష్ట్రమంతా అన్ని ఊర్లలో బైక్ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. సంఘీభావ ర్యాలీలు చేశారు. 

సరిగ్గా ఇక్కడే అసలు పాయింట్ తలెత్తుతోంది. రాష్ట్రమంతా తెలుగుదేశం సాగించిన ర్యాలీలు, పాదయాత్రలు, బైక్ ర్యాలీలు సోమవారం నాడు నిరాటంకంగా జరిగాయి. ఇన్ని ఊర్లలో పట్టణాల్లో తెలుగుదేశం వారి ర్యాలీలు అన్నీ కూడా ఎంచక్కగా చేయగలిగారంటే.. దాని అర్థం ఏమిటి? ప్రభుత్వం వారి పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నట్టే కదా! ప్రతిపక్షాలు గనుక.. వారి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నిజమైతే.. వారు ఇలా రాష్ట్రమంతా ర్యాలీలు చేయగలిగేవాళ్లేనా? అనే ప్రశ్న ఆలోచన పరుల్లో ఉత్పన్నం అవుతోంది.

మైకులు పెట్టుకుని, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాం అంటేనే.. ప్రభుత్వం అలాంటి వాటి మీద నియంత్రణకు నియమాలు జీవో నెం.1 రూపంలో తెచ్చింది. దానికి ర్యాలీలకు సంబంధం లేదు. అయితే వైసీపీ వారు ఊరూరా నిర్వహించిన అనేక ర్యాలీలను కూడా దానికి ముడిపెడుతూ.. వారికో నీతి, విపక్షాలకో నీతి అమలుచేస్తారా అంటూ పచ్చ పార్టీలు, పచ్చ మీడియా నానా గోల  చేశాయి. 

కానీ ప్రభుత్వం , పోలీసు యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. ఇవాళ తెలుగుదేశం వాళ్లు కూడా రాష్ట్రమంతా కూడా ర్యాలీలు చేయగలిగారు. కానీ ప్రభుత్వం మీద మాత్రం అణచివేత నిందలు వేస్తుంటారు. అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. 

నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి.. పోలీసు యంత్రాంగం అడిగిన వివరాలు కూడా చాలా సహేతుకమైనవి. పాదయాత్ర ముసుగులోకి అవాంఛనీయ శక్తులు చొరబడి ఏదైనా అల్లర్లు చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు. అందుకే ప్రాథమికంగా పాల్గొనేవాళ్లెవరో తెలిస్తే.. పోలీసులు తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడానికి, భద్రత కల్పించడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఫలానా వివరాలు ఇవ్వండి అని అడిగిన దగ్గరినుంచి నానా యాగీ చేస్తూ తెలుగుదేశం దళాలు చాలా నీచంగా వ్యవహరిస్తున్నాయి. యాత్ర చేయడం కంటె, రాద్ధాంతం చేయడం మీదనే దృష్టిపెడుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?