Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఉమా మహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐకి లేఖ!

ఉమా మహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐకి లేఖ!

తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఏపీలో నీచ రాజకీయాలు వీరలెవెల్లో సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీలో ఏ పార్టీ తక్కువగా లేదు. ఒక పార్టీ పవిత్రమని, మరో పార్టీ పాపపంకిలమని చెప్పలేం. చివరకు మరణాలను, ఆత్మహత్యలను కూడా రాజకీయ అస్త్రాలుగా వాడుకుంటున్నారు. తమ రాజకీయ కక్షలు తీరుకుంటున్నారు. 

కాదేదీ రాజకీయాలకు అనర్హం అనిపిస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చివరి కుమార్తె ఉమా మాహేశ్వరి ఆత్మహత్యను ఉపయోగించుకొని రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి అంటే ఎన్టీఆర్ కుటుంబానికి పడదు. ఆ కుటుంబమంటే ఆమెకు పడదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె మనసులో పేరుకున్న కక్షను తీర్చుకుంటూ ఉంటుంది.

ఎన్టీఆర్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు కూడా అలాగే ఉందనుకోండి. లక్ష్మీపార్వతికి -ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న తగాదాల గురించి బోలెడు కథలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆమెకు చంద్రబాబు నాయుడంటే అరికాలి మంట నెత్తికెక్కుతుంది. 

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడనే పేరు చంద్రబాబుకు ఈనాటికీ పోలేదు. ఇది ఆయన రాజకీయ ప్రత్యర్థులకు పెద్ద అస్త్రంగా ఈనాటికీ ఉపయోగపడుతోంది. ఇదిలా ఉంటే... ఉమామహేశ్వరిని చంద్రబాబే చంపించి ఉండొచ్చనే అర్థం వచ్చేలా లక్ష్మీ పార్వతి మాట్లాడింది. ఆమె మీడియాతో చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఆమె మాట్లాడినదానికి ఆధారాలు ఉన్నాయో లేవో తెలియదు. 

ఉమామహేశ్వరి మరణం కూడా మిస్టరీగానే ఉందని, సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయని ఆమె అన్నది. సోషల్ మీడియాలో నమ్మేవి ఉన్నాయి. కొన్ని నమ్మనివి  ఉండొచ్చని చెప్పింది. ఉమామహేశ్వరి పోలీసులకు ఒక లేఖ రాసి ఉండొచ్చని, అయితే చంద్రబాబు రంగ ప్రవేశం చేశాక ఆ లేఖ మాయమైందని అంటున్నారని లక్ష్మీ పార్వతి ఆరోపించింది. ఆస్తి వివాదాల వల్లే  ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పింది. చంద్రబాబు తన కొడుకుని అందలం ఎక్కించడానికి ఏమైనా చేస్తాడని మండిపడింది. ఒకవేళ నువ్వు (బాబు ) వారి సమస్య ఏమిటో ఒక కుటుంబ పెద్దగా పరిష్కరించలేవా? అని ప్రశ్నించింది.

ఉమా మహేశ్వరి సూసైడ్ నోట్ బాబు దొంగిలించాడని  ప్రచారం జరుగుతోందని అన్నది. ఇప్పటికైనా పార్టీని బాలకృష్ణకు అప్పజెప్పి పక్కకు తప్పుకోవాలని, ఈ విషయంలో ఏమీ లేదంటే నువ్వు వెంటనే సీబీఐ విచారణకు లేఖ రాయాలని బాబును ఉద్దేశించి అన్నది. నీకు రాయడం చేతకాకపోతే నేనే సీబీఐకి లేఖలు రాస్తా, సీబీఐ క్లీన్ చిట్ ఇస్తే కానీ నిన్ను నమ్మలేను అంటూ లక్ష్మీపార్వతి చంద్రబాబుపై విరుచుకుపడింది.   

ఇదిలాఉంటే ...ఉమామహేశ్వరి మరణానికి చంద్రబాబే కారణమంటూ ఉదయం ట్వీట్ పెట్టిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ తర్వాత పప్పూ పిన్నిని ఎందుకు చంపావంటూ మరో ట్వీట్ లో లోకేష్ ను ప్రశ్నించారు. దీంతో టీడీపీ నేతలు సాయిరెడ్డి ట్వీట్లపై తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇదే క్రమంలో నారా లోకేష్ కూడా భగ్గుమన్నారు. మరణించాక ఎన్టీఆర్‌ శవాన్ని లాక్కున్నారు! కోడెల శివప్రసాద్ కంటే ముందుగా ఆయన సెల్‌ ఫోన్‌కు అంత్యక్రియలు చేశారు! ఇప్పుడు...పప్పుగాడి పిన్ని గారు --చున్నీతో ఉరి వేసుకుందంటున్నారు! ఏం క్రిమినల్స్‌ ఫ్యామిలీరా బాబూ మీది! అంటూ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో వైఎస్ గారి మరణంపై వాళ్ళు  అవమానకరంగా మాట్లాడారు. జగన్ గారిపై హత్యాయత్నం చేయించి కోడి కత్తి అంటూ హేళన చేశారు. బరితెగించినోళ్లకి చంపడం, సుపారీ హత్యలు చేయించడం ఒక లెక్కా? అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు.

దీనిపై లోకేష్ మండిపడ్డారు. ఉమామహేశ్వరి మరణానికి చంద్రబాబు కుటుంబం, హెరిటేజ్ లో పెట్టుబడులు కారణమంటూ సోషల్ మీడియాలో వైసీపీ వైరల్ చేస్తున్న పోస్టుల్ని తప్పుబడుతూ వాటిని ఫేక్ గా లోకేష్ తెలిపారు. టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసిన సైకో జగన్ రెడ్డి తన క్రిమినల్ రూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నదన్నారు. డోర్‌ నెంబర్ కి సర్వే నెంబర్ కి తేడా తెలియని కిరాయిగాళ్లతో మా చిన్నమ్మ మరణంపై విష‌ప్రచారం చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. 

కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు అంటూ ఆస్కార్ రేంజ్ న‌టన, ఒకే కులం డిఎస్పీలు 35 మందికి ప్ర‌మోష‌న్లు, పింక్ డైమండ్ పేరుతో చేసిన అస‌త్య విష‌ప్ర‌చార‌మేనన్నారు. తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి నా చిన్న‌మ్మ ఉమామ‌హేశ్వ‌రి గారి మ‌ర‌ణంపైనా విషప్రచారం చెయ్యబోయి బొక్కబోర్లా పడ్డారు.

తండ్రి శ‌వాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాల‌ని సంత‌కాలు చేసిన నీచ చ‌రిత్ర గ‌లిగిన జ‌గ‌న్‌రెడ్డి, ఎన్నిక‌ల్లో సానుభూతి కోసం బాబాయ్ మ‌ర్డ‌ర్‌నీ వాడుకున్నారు. జ‌నాన్ని దోచి దాచుకుని, నెత్తుటి కూడు తింటూ, త‌ర‌త‌రాల‌ ర‌క్త‌చ‌రిత్రకి వార‌సుడైన జ‌గ‌న్‌రెడ్డీ...చిన్న‌మ్మ మ‌ర‌ణంతో మేము విషాదంలో వుంటే విష‌ప్ర‌చారం చేస్తూ వినోదం పొందుతావా? నీ పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ ద‌గ్గ‌ర ప‌డింది. మీరు చేస్తున్న పాపాలకు ఆ దేవుడి స్క్రిప్ట్ ప్రకారం శిక్ష అనుభవిస్తారు అంటూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఈ రెండు పార్టీల నాయకుల ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తే పిచ్చెక్కిపోతోంది. తెలుగు రాష్ట్రాలు నీచ నికృష్ట రాజకీయాలకు వేదికలయ్యాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?