Advertisement

Advertisement


Home > Politics - Andhra

చంద్రబాబుపై పాట రాసిన విజయసాయి

చంద్రబాబుపై పాట రాసిన విజయసాయి

చంద్రబాబు పేరెత్తికే అంతెత్తున మండిపడతారు ఎంపీ విజయసాయి. అవకాశం దొరికిన ప్రతిసారి చంద్రబాబును చెడుగుడు ఆడుకుంటారు. మరి అలాంటి చంద్రబాబాపై విజయసాయి ఓ పాట రాస్తే ఎలా ఉంటుంది? ఆ సందర్భం రానే వచ్చింది. చంద్రబాబుపై విజయసాయి పాట అందుకున్నారు. అదెలా ఉందో మీరే చూడండి..

"ఆ గట్టునున్నావా తుప్పన్నా... ఈ గట్టునున్నావా పప్పన్నా...

ఆ గట్టునుంటే జనసేనకు నిప్పు… ఈ గట్టునుంటే బీజేపీకి ముప్పు… 

మరి ఏ గట్టునుంటావు నారన్న!

ఏ గట్టునైనా ఉన్నావో లేదో… కరకట్టనున్నావు నారన్నా!"

చూశారుగా.. ఇలా చంద్రబాబుపై తనదైన స్టయిల్ లో ఓ పాట అందుకున్నారు విజయసాయి. తుప్పన్నా, నారన్న అంటూ సంభోదిస్తూ.. మధ్యమధ్యలో నిప్పు, పప్పు లాంటి పద ప్రయోగాలు చేస్తూ.. ఎక్కడా ప్రాస మిస్సవ్వకుండా బాబుపై పాట రాశారు విజయసాయి. ఏదో పాట రాయాలి కాబట్టి రాసినట్టు లేదిది. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి, టీడీపీ స్థితికి అద్దం పట్టేలా సాగింది.

చంద్రబాబుకు బీజేపీకి కావాలి, జనసేన కూడా కలిసిరావాలి. కానీ చంద్రబాబు, పవన్ తో కలిస్తే జనసేనకు నిప్పు పెడతారని.. ఇక బీజేపీతో కలిస్తే అది కమలానికే పెద్ద ముప్పు అని అర్థం వచ్చేలా సాగింది ఈ పాట. ఏ గట్టునైనా ఉన్నావా.. లేక  కరకట్ట మీద ఉన్నావా అంటూ చివర్లో విజయసాయి ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అదిరింది.

చంద్రబాబుపై, విజయసాయి విమర్శలు గుప్పించడం సర్వసాధారణం. కొన్నేళ్లుగా తన పంచ్ లతో బాబు-లోకేష్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు ఈ ఎంపీ. అయితే ఇలా పాట కట్టి మరీ ఏడిపించడం ఇదే తొలిసారి. అందుకే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?