Advertisement

Advertisement


Home > Politics - Andhra

గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల జాత‌ర‌...వైసీపీలో జోష్‌!

గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల జాత‌ర‌...వైసీపీలో జోష్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఓట‌ర్ల‌లో ఉత్సాహం ఉర‌క‌లేస్తోంది. ఐదేళ్ల‌కో సారి వ‌చ్చే ఓట్ల పండుగ‌లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం సొంతూళ్ల‌కు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీర‌డం విశేషం. స‌హ‌జంగానే ప‌ట్ట‌ణ ప్రాంతాల‌తో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లోనే ఓట‌ర్లు త‌మ హ‌క్కును వినియోగించుకోడానికి ఎక్కువ ఆస‌క్తి చూపుతుంటారు.

ఒక‌వేళ ఓటు వేయ‌క‌పోతే చ‌నిపోయిన వారితో స‌మానంగా గ్రామీణులు భావిస్తుంటారు. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓటు వేసి తీరాల్సిందే అని ప‌ట్టుద‌ల‌తో వుంటారు. ఓటు వేసేందుకు ఎంత రిస్క్ చేయ‌డానికైనా గ్రామీణులు వెనుకాడ‌రు. ఓట‌ర్ల‌ను పోలింగ్ బూత్‌ల‌కు త‌ర‌లించేందుకు ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేస్తుంటారు. మ‌రోసారి గ్రామీణులు ఓట్లు వేయ‌డంతో త‌మ నిబ‌ద్ధ‌త‌ను చాటుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీ ఫుల్ ఖుషీగా వుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బ‌లంగా వుంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ చెప్పేమాట‌. ఇందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలే కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు.

గ్రామీణ ప్ర‌జానీకం ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న సాగింద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. అందుకే జ‌గ‌న్‌ను మ‌రోసారి సీఎం చేసుకోడానికే గ్రామీణ ఓట‌ర్లు పోలింగ్ బూత్‌ల వ‌ద్ద‌కు వెల్లువెత్తుతున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?