Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఆకాశం నుంచి విశాఖ అందాలు...

ఆకాశం నుంచి విశాఖ అందాలు...

విశాఖ అంటేనే అందం అని అర్ధం చేసుకుంటారు ప్రకృతి ప్రేమికులు. సహజ సిద్ధమైన సొగసులతో ఎప్పటికీ వన్నె తరని గని విశాఖ అని అంతా ఒప్పుకుంటారు, చెప్పుకుంటారు. విశాఖలో అనేకమైన టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. అదే విధంగా పలు రకాలైన బ్యూటీ స్పాట్స్ ఉన్నాయి. అన్నింటికీ ఒకేసారి చూడడం అంటే జరగని పని అసాధ్యం కూడా.

కానీ దాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ, సుసాధ్యం చేయబోతోంది. విశాఖలో స్కై టవర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కై టవర్ సముద్రమట్టానికి భారీ ఎత్తున 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ ఉంటుంది. ఇందులో 70 మంది దాకా కూర్చునేలా ఏర్పాటు ఉంటుంది.

అలా గగన తలాన విహరిస్తూ విశాఖ అందాలను వీక్షించేలా స్కై టవర్ ని డిజైన్ చేస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ, స్విట్జర్లాండ్ కి  చెందిన ఇంటిమిన్ సంస్థతో కలసి విశాఖలో స్కై టవర్ ని ఏర్పాటు చేయడానికి తాజాగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

విశాఖను టూరిజం పరంగా అభివృద్ధి చేయాలన్న వైసీపీ ప్రభుత్వం అందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసింది. ఇది కనుక పూర్తి అయితే ఆకాశం నుంచి విశాఖ అందాలు మొత్తాన్ని ఒకేసారి చూడవచ్చు. ఇక రాత్రివేళలో మిరుమిట్లు గొలిపే వైజాగ సిటీ బ్యూటీని కూడా తనివితీరా ఆస్వాదించవచ్చు. ఈ ప్రతిపాదిత  ప్రాజెక్ట్ పర్యాటక ప్రేమికులలో కొత్త ఆశలను రేపుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?