Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఓటింగ్ శాతం ఎంతకు చేరుతుంది?

ఓటింగ్ శాతం ఎంతకు చేరుతుంది?

ఆంధ్రలో ఓటింగ్ వెల్లు వెత్తుతోంది. తొలి ఆరుగంటలకే 40శాతం పోలింగ్ నమోదు అయింది. ఎండ వేళ కూడా చాలా బూత్ ల దగ్గర జనాలు బారులు తీరి కనిపిస్తున్నారు. ఈ తరహా సీన్ కు ఈ జిల్లా..ఆ జిల్లా అని లేదు. దాదాపు ప్రతి ప్రాంతం ఒకే మాదిరిగా వుంది.

హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయల్దేరిన బస్ ల్లో ఓటర్లు ఈ ఉదయం ఆలస్యంగా చేరుకున్నారు. వారంతా అభ్యర్ధులు నేరుగా తీసుకువచ్చిన వారే. ఏ పార్టీ అభ్యర్దులు కూడా ఓటర్లను వదలడం లేదు. నలుగురు ఓటర్లు వుంటే చాలు, అవసరం అయితే కారు పంపించి తీసుకువస్తున్నారు.

చూస్తుంటే ఈ సారి ఓటింగ్ శాతం కొత్త రికార్డు నెలకొల్పుతుందా అన్న వార్తలు వినిపిస్తున్నాయి. పోలింగ్ శాతం  కనుక ఎక్కువ వుంటే అది ప్రతి పక్షానికి అనుకూలంగా వుంటుందని అంటున్నారు. అది కూడా ఎలా వుంటుందన్నది చూడాలి. నిన్న మొన్నటి దాకా గట్టి పోటీ అనుకున్న నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఇప్పుడు వన్ సైడ్ అనే మాటలు వినిపిస్తున్నాయి.

గొడవలు మరీ ఎక్కువగా ఎక్కడా జరగలేదు. చిన్న చిన్న సంఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఓటర్లు కొంచెం ఎక్కువ చైతన్యవంతం అవుతున్నారని ప్రజా ప్రతినిధులు గమనించుకోవడం లేదు. అందువల్ల అనవసరంగా చేయి చేసుకుని, తెనాలి ఎమ్మెల్యే ఎదురు దెబ్బలు తిని నగుబాటు అయ్యారు. ఓటర్ల దూకుడు తెలియకుండా పిఠాపురంలో వంగా గీత లాంటి వారు ఎదురు ప్రశ్నలకు గురయ్యారు.

కొన్ని చోట్ల వాహనాల మీద దాడి వంటి సంఘనటలు జరిగాయి. కానీ పార్టీల మధ్య వున్న పోటీ, ప్రతిష్ట అన్నీ లెక్కలోకి తీసుకుంటే మాత్రం ఈ ఎన్నికలు కాస్త ప్రశాంతంగానే జరుగుతున్నట్లు లెక్క.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?