Advertisement

Advertisement


Home > Politics - Andhra

జనసేనకు నాయకుల కొరత

జనసేనకు నాయకుల కొరత

ఉత్తరాంధ్రా జిల్లాలలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్న జనసేనకు నాయకుల కొరత బాగా ఏర్పడిరది అంటున్నారు. 

కొందరు అధికారులు, సామాజిక ఉద్యమకారులు ఆ పార్టీలో ఇపుడు క్రియాశీలకంగా ఉంటున్నా జనంలో పలుకుబడి ఉంటూ రాజకీయాలలో అనుభవం కలిగిన వారు ఉంటేనే పార్టీ పరుగులు తీస్తుంది. దానికోసం జనసేన ఇపుడు ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. 

ఆ మధ్యన టీడీపీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేరుతారని ప్రచారం జరిగింది కానీ ఆయన ఎందుకో ఆగిపోయారని అంటున్నారు. ఇక మాజీ మంత్రి వైసీపీ నేత దాడి వీరభద్రరావు జనసేనలో చేరుతారని కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ అది కూడా నిజం కాలేదు. ఆయన సైతం ఉన్న పార్టీలోనే తన ఉనికిని చూసుకుంటున్నారు. 

ఇక ఒకనాడు ప్రజారాజ్యంలో ఉంటూ తరువాత టీడీపీలోకి వెళ్లి అక్కడ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరుతారని భావించారు. కానీ వారిని ఇపుడు వైసీపీ సమాదరించడంతో వారు కూడా పార్టీ మారే ఆలోచనలు విరమించుకున్నారని తెలుస్తోంది. 

మొత్తం మీద చూసుకుంటే జనసేనకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతోకొంత బలం ఉందని భావిస్తున్నారు కానీ సరైన నాయకులు లేకపోవడం వల్ల పార్టీ పడకేసింది అంటున్నారు. మరి రానున్న రోజులలో ఎవరైనా జనసేనలో చేరుతారా లేదా అన్నది చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?