Advertisement

Advertisement


Home > Politics - Andhra

టీడీపీని బోనులో నిలబెట్టిన జగన్...?

టీడీపీని బోనులో నిలబెట్టిన జగన్...?

తెలుగుదేశం పార్టీ వల్లనే విశాఖకు పరిపాలనా రాజధాని రాలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుండ బద్ధలు కొట్టారు. స్ట్రైట్ గానే ఆయన టీడీపీ మీద ఈ ఆరోపణలు చేశారు. ఉత్తరాంధ్రా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని, విశాఖకు రాజధానిగా చేయాలనుకుంటే టీడీపీ అడ్డుపడి కోర్టులలో కేసులు వేయించిందని జగన్ చెప్పడం విశేషం.

ఇక కర్నూల్ రాజధానిగా ఒకనాడు రాయలసీమ వెలుగు వెలిగిందని, అలాంటి చోట తరువాత కాలంలో ఏ అభివృద్ధీ లేదని, అలాంటి చోట న్యాయ రాజధాని ఏర్పాటు చేయాల‌ని చూస్తే అది కూడా జరగనివ్వలేదని జగన్ నేరుగా జనాలకే చెప్పుకున్నారు.

విశాఖ పరిపాలనా రాజధాని విషయాన్ని ఆయన విశాఖ పర్యటనలోనే ప్రస్థావించడం ద్వారా జనాలలో ఉన్న సెంటిమెంట్ ని తట్టిలేపే ప్రయత్నం చేశారు. అలాగే ఉత్తరాంధ్రా ఆత్మ గౌరవ నినాదాన్ని కూడా ఆయన ఒడుపుగా  లేవనెత్తారు.

మరో వైపు చూస్తే విశాఖకు అన్ని అర్హతలు ఉన్నా రాజధాని కాలేకపోవడానికి ముమ్మాటికీ తప్పు టీడీపీదే అని సూటిగా చెప్పేశారు. ఇది ఒక సంకేతంగా చూడాలి. రానున్న రోజుల్లో విశాఖ సహా ఉత్తరాంధ్రా వాసులకు తీరని అన్యాయం చేసిన పార్టీగా జగన్ టీడీపీని చూపించే ప్రయత్నం అయితే మొదలైంది. అది ఇంకా గట్టిగా జరుగుతుంది. ఒక విధంగా ప్రజా కోర్టులో బోనులో జగన్ టీడీపీని నిలబెట్టారు.

మరి దాని మీద టీడీపీ ఏం చెప్పదలచుకుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే విశాఖ రాజధాని కావాలనీ ఏ ఒక్క టీడీపీ నేత కోరలేదు సరికాదా అమరావతి రాజధానికే మద్దతుగా మాట్లాడారు, మరి రేపటి రోజున ఇదే సెంటిమెంట్ గా చాలా గట్టిగా రాజుకుంటే దానికి సరైన జవాబు, అది కూడా జనాలను కన్విన్స్ చేసే విధంగా టీడీపీ వద్ద ఉండాలి. 

మొత్తానికి జగన్ వ్యూహాత్మకంగానే విశాఖ రాజధానిని ప్రస్థావించారు. ఇది ఆరంభం, మరి దీనికి అడ్డుకట్ట టీడీపీ వేయగలుగుతుందా. లేక బోనులో నిలబడుతుందా అన్నది చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?