Advertisement

Advertisement


Home > Politics - Andhra

కూట‌మిని భ‌య‌పెడుతున్న జ‌గ‌న్ మ్యానిఫెస్టో

కూట‌మిని భ‌య‌పెడుతున్న జ‌గ‌న్ మ్యానిఫెస్టో

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీలు విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. వైసీపీ ఒంట‌రిగా, టీడీపీ-జ‌న‌సేన -బీజేపీ కూట‌మిగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తున్నాయి. ఎన్నికల్లో మ్యానిఫెస్టో అనేది అత్యంత కీల‌క‌మైంది. ఇదే గెలుపోట‌ముల‌ను నిర్ణ‌యించేది.

గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల పేరుతో మ్యానిఫెస్టో ప్ర‌క‌టించారు. ఆ సంక్షేమ ప‌థ‌కాలే జ‌గ‌న్‌కు అధికారం తెచ్చి పెట్టాయి. ఎందుకంటే 2014లో 650 హామీల‌తో చంద్ర‌బాబు నేతృత్వంలోని ఇదే కూట‌మి హామీలు గుమ్మ‌రించింది. చివ‌రికి ఏ ఒక్క హామీని నెర‌వేర్చ‌లేదు. ముఖ్యంగా రైతుల రుణ‌మాఫీ, డ్వాక్రా రుణ‌మాఫీ చేయ‌కపోవ‌డంతో 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు రాజ‌కీయంగా చావు దెబ్బ తిన్నారు.

కానీ 2019లో తాను ఇచ్చిన హామీల్లో 98 శాతం నెర‌వేర్చిన‌ట్టు జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతున్నారు. తాను చెప్పింది చేసి వుంటేనే ఓటు వేయాల‌ని ఆయ‌న అభ్య‌ర్థిస్తున్నారు. ప్ర‌స్తుతానికి వ‌స్తే చంద్ర‌బాబునాయుడు ఇప్ప‌టికే రాజ‌మండ్రి మ‌హానాడు స‌భ‌లో సూప‌ర్ సిక్స్ పేరుతో సంక్షేమ ప‌థ‌కాల్ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇందులో అన్నీ జ‌గ‌న్‌, కాంగ్రెస్‌ల నుంచి అరువు తెచ్చుకున్న‌వే. కూట‌మిగా ఏర్ప‌డిన త‌ర్వాత మ్యానిఫెస్టోపై వాయిదాల ప‌ర్వం న‌డుస్తోంది.

కూట‌మి మ్యానిఫెస్టో ఇదిగో, అదిగో అంటూ ఊరిస్తున్నారే త‌ప్ప‌, ప్ర‌క‌టించ‌డానికి ధైర్యం చేయ‌డం లేదు. వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మ్యానిఫెస్టో కోసం కూట‌మి ఎదురు చూస్తోంది. జ‌గ‌న్ చెప్పాడంటే చేస్తాడ‌నే విశ్వాసం ప్ర‌జ‌ల్లో వుంది. అందుకే జ‌గ‌న్ మ్యానిఫెస్టోలో ప్ర‌క‌టించే దాన్ని బ‌ట్టి, కూట‌మి త‌మ మ్యానిఫెస్టో ప్ర‌క‌టించాల‌నే ఆలోచ‌న‌లో వున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే త‌న మ్యానిఫెస్టోలో ఏం వుంటుంద‌నే విష‌య‌మై జ‌గ‌న్ లీక్ ఇవ్వ‌డం లేదు. జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌ని మ్యానిఫెస్టో కూట‌మిని నిలువెల్లా భ‌య‌పెడుతోంది. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ చేస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. అయితే రుణ‌మాఫీని గ‌తంలో జ‌గ‌న్ వ్య‌తిరేకించారు. ఈ ద‌ఫా రైతు రుణ‌మాఫీ చేయాల‌ని సొంత పార్టీ నేత‌ల నుంచి జ‌గ‌న్‌పై తీవ్ర ఒత్తిడి వుంది. ఇదే జ‌రిగితే కూట‌మి గోవిందా అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎందుకంటే ఓట‌ర్ల‌లో అత్య‌ధికులు రైతులు, మ‌హిళ‌లే. వారిని ఆక‌ర్షించేలా జ‌గ‌న్ మ్యానిఫెస్టో వుంటే, కూట‌మి ఎలా ఎదుర్కొంటునేదే ప్ర‌శ్న‌. గ‌తంలో చంద్ర‌బాబు రుణ‌మాఫీ అని చెప్పి నెర‌వేర్చ‌లేదు. ఆయ‌న‌పై రైతాంగం తీవ్ర ఆగ్ర‌హంగా వుంది. బాబు విఫ‌ల‌మైన హామీల విష‌యంలో జాగ్ర‌త్త‌గా అడుగులు వేసి, మ‌రోసారి విజ‌యాన్ని అందుకోవాల‌ని జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే కూట‌మి మ్యానిఫెస్టో విడుద‌ల కూడా ఆల‌స్య‌మ‌వుతోంది. మ్యానిఫెస్టో విష‌యంలో కూట‌మి భ‌యాన్ని గుర్తించిన జ‌గ‌న్ మ‌రికొంత కాలం త‌న మ్యానిఫెస్టో విడుద‌ల‌ను ఆల‌స్యం చేసే అవ‌కాశం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?