గీతంపై పెల్లుబుకుతున్న ఆగ్రహం..?

విశాఖ గీతం విద్యాసంస్థల మీద స్థానికులు, ప్రజా సంఘాల ఆగ్రహం పెల్లుబుకుతోంది. గీతం విద్యా సంస్థల పేరిట కబ్జా చేసిన భూములను వెనక్కు తీసుకోవాలని ప్రజా గాయకుడు దేవిశ్రీ డిమాండ్ చేస్తున్నారు. నగరం నడిబొడ్డున…

విశాఖ గీతం విద్యాసంస్థల మీద స్థానికులు, ప్రజా సంఘాల ఆగ్రహం పెల్లుబుకుతోంది. గీతం విద్యా సంస్థల పేరిట కబ్జా చేసిన భూములను వెనక్కు తీసుకోవాలని ప్రజా గాయకుడు దేవిశ్రీ డిమాండ్ చేస్తున్నారు. నగరం నడిబొడ్డున ఆయన తన ఆటా పాటతో గీతం చేసిన భూ దందాలను గురించి జనాలను కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.

ఉత్తరాంధ్రా మాది అని విర్రవీగవద్దు, ఇక్కడ భూములు మింగేయాలని చూడవద్దు అంటూ ఆయన దందా బ్యాచ్ కి గట్టిగానే హెచ్చరికలు పంపుతున్నారు.  గీతం కి ఇన్నేసిఎకరాలు రావడానికి ఎన్టీయార్, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉంటూ దారాదత్తం చేయడమే కారణమని దేవీశ్రీ ప్రసాద్ ఆరోపించారు.

గీతం ఉత్త పుణ్యానికి ఎవరికీ విద్య నేర్పడం లేదని, ప్రత్యేకించి పేదలు, సామాన్యులకు ఫీజుల్లో ఒక్క రూపాయి కూడా తగ్గించలేదని కూడా ఆయన గుర్తుచేస్తున్నారు. ఒక్కో సీటుని మూడు నుంచి ఏడేసి లక్షలకు అమ్ముకుంటూ విద్యా వ్యాపారం చేసిందని కూడా ఆరోపించారు.

గీతం పేరులో గాంధీని పెట్టుకుని నీతులు చెబుతోందని, కానీ చేసినది మాత్రం ప్రభుత్వ భూముల ఆక్రమణలని దేవీశ్రీ ప్రసాద్ అంటున్నారు. ఇక గీతం గుర్తింపుని రద్దు చేసి ఆంధ్రా యూనివర్శిటీకి అనుసంధానం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

గీతం భూములను ప్రభుత్వం తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ విధ్యార్ధి విభాగం నాయకుడు కాంతారావు కోరుతున్నారు. గీతం రోస్టర్ విధానం పాటించలేదని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని కూడా అనుసరించడంలేదని  ఆయన అంటున్నారు. 

ఈ మేరకు హోం మంత్రి మేకతోటి సుచరితకు ఆయన వినతిపత్రం ఇచ్చారు. మొత్తానికి చూస్తే గీతం విషయంలో ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయని అర్ధమవుతోంది.

జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయం