ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అనిల్‌కుంబ్లే సోమవారం కలిశారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరి మధ్య క్రీడలతో పాటు వాటికి సంబంధించి వ్యాపార చర్చలు కూడా జరిగినట్టు సమాచారం.
ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్‌ను అనిల్‌కుంబ్లే కలిశారు. ఏపీలో క్రీడాభివృద్ధికి సంబంధించి ఇరువురి మధ్య చర్చలు జరిగినట్టు తెలిసింది. అలాగే క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీ పెడితే బాగుంటుందని సీఎంకు అనిల్‌కుంబ్లే సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్పోర్ట్స్ యూనివర్శిటీ పెడితే తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లే సీఎంకు చెప్పారు. అలాగే క్రీడాసామగ్రీ తయారీ పరిశ్రమ పెడితే ప్రయోజనం ఉంటుందని సీఎంకు అనిల్‌కుంబ్లే సూచించారు. ప్రస్తుతం జలంధర్, మీరట్ లాంటి నగరాల నుంచే అన్నిరకాల క్రీడా సామగ్రిని తెచ్చుకుంటామని జగన్‌కు ఆయన వివరించారు.
ఏపీలో క్రీడా సామగ్రీ తయారీ పరిశ్రమ పెడితే సుదూరాలకు పోవాల్సిన అవసరం ఉండదన్నారు. క్రీడా సామగ్రీ తయారు చేయడానికి సంబంధించి తన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు సీఎంకు కుంబ్లే హామీ ఇచ్చారు.