సంచ‌యిత‌పై బాబాయ్ అభ్యంతర వ్యాఖ్య‌లు

టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తి రాజు అంటే పార్టీల‌కు అతీతంగా అంద‌రూ గౌర‌విస్తారు. అందుకు  త‌గ్గ‌ట్టుగానే అశోక్ గ‌జ‌ప‌తిరాజు కూడా న‌డుచుకుంటారనే పేరు.  Advertisement అయితే మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారం…

టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తి రాజు అంటే పార్టీల‌కు అతీతంగా అంద‌రూ గౌర‌విస్తారు. అందుకు  త‌గ్గ‌ట్టుగానే అశోక్ గ‌జ‌ప‌తిరాజు కూడా న‌డుచుకుంటారనే పేరు. 

అయితే మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారం విజ‌య‌న‌గ‌రం రాజుల కుటుంబంలో తీవ్ర మ‌న‌స్ప‌ర్థ‌లు తీసుకొచ్చింది. మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్‌ప‌ర్స‌న్‌గా సంచ‌యిత బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో విజ‌య‌న‌గ‌రం  గ‌జ‌ప‌తిరాజుల కుటుంబంలో చిచ్చు ర‌గిల్చింది.

కొంత కాలంగా సంచ‌యిత‌, ఆమె బాబాయ్ అశోక్‌గ‌జ‌ప‌తి రాజు మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. తాజాగా అశోక్ గ‌జ‌ప‌తిరాజు త‌న స్థాయిని దిగ‌జార్చుకుని అన్న కూతురిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. 

తాజాగా సోష‌ల్ మీడియాలో సంచ‌యిత పెట్టిన‌ పోస్టుపై అశోక్ గ‌జ‌ప‌తిరాజు విరుచుకుప‌డ్డారు.

చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా? అంటూ సంచయితను ఉద్దేశించి ఆయ‌న ఘాటుగా వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏమ‌న్నారంటే… ‘సోషల్ మీడియాలో మీ తండ్రి ఎవరో మీరే పోస్టు చేశారు. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పోస్టులే మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి. 

ఎవరో పెట్టిన పోస్టులకు నేను సమాధానం చెప్పడం నా ఖర్మ. ఒక్కోచోట ఒక్కో విధంగా తండ్రి పేరు మార్చే పిల్లలను నేనెక్కడా చూడలేదు. తాత ఎవరో, తండ్రి ఎవరో తెలియదు. తండ్రి, తాతను సంచయిత ఒక్కసారైనా కలవలేదు. తమ పూర్వీకులు నిర్వీహించే ఆలయాలకు ఒక్కసారి కూడా రానివారు.. వాటి ఆస్తులపై కన్నేయడం బాధాకరం’ అని గజపతి రాజు తీవ్రంగా స్పందించారు.

సంచ‌యిత‌పై అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఎంత అస‌హ‌నంగా ఉన్నారో ఆయ‌న మాట‌లే తెలియ‌జేస్తున్నాయి. పెద్ద మ‌నిషిగా గుర్తింపు పొందిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు స్ధాయిని మ‌రిచి కూతురు వ‌రుస‌య్యే సంచ‌యిత‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. 

అధికారంలో లేనప్పుడు రాజ‌కీయ ఒడిదుడుకులు ఉండ‌డం స‌హ‌జం. వాటిని ఎదుర్కోవాలే త‌ప్ప‌, అసంబద్ధ వ్యాఖ్య‌ల‌తో ఎదుటి వాళ్ల‌ను కించ‌ప‌ర‌చాల‌నుకుంటే, అవి త‌మ‌కే ఎదురు తిరుగుతాయ‌ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు లాంటి సీనియ‌న్ నేత గుర్తించ‌క‌పోవ‌డం బాధాక‌రం. 

ఎందుకంటే సంచ‌యిత తండ్రి, తాత‌ల గురించి చుల‌క‌న‌గా మాట్లాడ్డం అంటే …ప‌రోక్షంగా అవి త‌న గురించే అని అశోక్ గ‌జ‌ప‌తిరాజు గుర్తించ‌లేని దుస్థితిలోకి వెళ్లిపోయారన్న మాట‌!

విజన్ 2020 అంటే అర్థం చేసుకోలేకపోయాం