బాబుకు చల్లని మాట చెప్పిన పల్లా

ఏపీలో రాజకీయం గురించి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉంది. పైగా గతం కంటే తక్కువ సీట్లు తెచ్చుకుని రాజకీయంగా ఇబ్బందులో ఉంది. ఆ పార్టీలో ఏ రోజు  ఎవరు ఉంటారో ఎవరు…

ఏపీలో రాజకీయం గురించి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉంది. పైగా గతం కంటే తక్కువ సీట్లు తెచ్చుకుని రాజకీయంగా ఇబ్బందులో ఉంది. ఆ పార్టీలో ఏ రోజు  ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి.

ఈ నేపధ్యంలో విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ చల్లని మాట చెప్పారు. తాను టీడీపీలోనే ఉంటాను, టీడీపీలోనే చస్తాను అని. నిజంగా అది ఈ  క్లిష్ట సమయంలో బాబుకు ఎంతో తీయని మాటగానే చూడాలి. విశాఖ లాంటి సిటీలో చాలా మంది నాయకులు పలాయనం చిత్తగిస్తున్న వేళ తాను చచ్చేంతవరకూ పార్టీలో ఉంటాను అని పల్లా  చెప్పడం నిజంగా వంటి వారికే సాధ్యమవుతుంది కదా.

మరో వైపు తనను  వైసీపీ పిలుస్తోందని, తాను రానందువల్లనే ఆక్రమణల పేరుతో ఆయన ఆస్తులను కూలగొడుతున్నారని పల్లా ఆరోపిస్తున్నారు. ఆయన ఇంతకు ముందు కూడా ఇదే మాట అన్నారు. అయితే వైసీపీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు పల్లా అవసరం ఏముంది అని ఆ పార్టీ నాయకులు రిటార్టు ఇస్తున్నారు. అక్రమంగా భూములు కబ్జా చేస్తే కూలగొట్టమా అంటున్నారు అధికార పార్టీ నేతలు.

మొత్తానికి పల్లా వర్సెస్ వైసీపీ పొలిటికల్ వార్ లో చంద్రబాబుకు ఊరటనిచ్చేది ఏంటి అంటే పల్లా టీడీపీకి శాశ్వత తమ్ముడు అన్న అంశమే. చిత్రమేంటి అంటే ఇదే పల్లా 2008 ప్రాంతంలో ప్రజారాజ్యంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి  వచ్చిన ట్రాక్ రికార్డ్ ఉంది. అందుకే ఇపుడు ఆయన మీద ఈ రకమైన ప్రచారాలు అన్న కధనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.