24 గంటల్లో మారిన టీడీపీ స్ట్రాటజీ

మూడు రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్ర వైసీపీ విజయంగా భావిస్తూ.. ఆ పార్టీ శ్రేణులు శనివారం వైఎస్సార్ విగ్రహాలకు, జగన్ ఫొటోలకు పాలాభిషేకాలు చేశాయి. చంద్రబాబుపై దుమ్మెత్తిపోశాయి, దమ్ముంటే రాజీనామాలు చేసి అమరావతి అజెండాతో…

మూడు రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్ర వైసీపీ విజయంగా భావిస్తూ.. ఆ పార్టీ శ్రేణులు శనివారం వైఎస్సార్ విగ్రహాలకు, జగన్ ఫొటోలకు పాలాభిషేకాలు చేశాయి. చంద్రబాబుపై దుమ్మెత్తిపోశాయి, దమ్ముంటే రాజీనామాలు చేసి అమరావతి అజెండాతో తిరిగి గెలవాలని టీడీపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు నేతలు. ఇక టీడీపీ నేతలు కూడా రాజధానిపై నానా రచ్చ చేశారు. రాష్ట్రం నాశనమైపోతుందని, అమరావతిలో పెట్టిన పెట్టుబడుల్ని ఏం చేస్తారని, జనం సొమ్ము బూడిదలో పోశారని శాపనార్థాలు పెట్టారు.

దీంతో రాజధాని గొడవ కాస్తా రెండు పార్టీల గొడవలా మారింది. అమరావతి బాధ ప్రజల బాధ కాదని, అది కేవలం పచ్చనాయకుల బాధ మాత్రమేనని మిగతా జనాలకు అర్థమైంది. దీంతో చంద్రబాబు రాత్రికి రాత్రే స్ట్రాటజీ మార్చారు.

“ఇకపై టీడీపీ నాయకులెవరూ ప్రత్యక్షంగా అమరావతి కోసం పోరాటాలు చేయకూడదు, చేసినా అనుబంధ సంఘాలను ముందు పెట్టుకునో, విద్యార్థి సంఘాల అండతోనో ఆందోళనలు నిరసనలు చేయాలి. రాజధాని ప్రాంతంలో జరిగే పోరాటాలు కూడా కేవలం రైతులు చేస్తున్న పోరాటాల్లాగానే ఉండాలి. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఇదే విషయం హైలెట్ కావాలి కానీ, టీడీపీ నేతలు హైలెట్ కాకూడదు.” ఇదీ నారా వారి న్యూ స్ట్రాటజీ.

దీనికి అనుగుణంగానే ఈరోజు పచ్చపాత మీడియా రైతుల్ని బాగా హైలెట్ చేసింది. రైతులతో అన్ని పార్టీల నేతలపై ఒత్తిడి తెప్పించాలనే దురాలోచన కూడా టీడీపీదే. రాజధాని రైతులకు మద్దతు తెలిపిన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఇప్పుడు బైటకు రావాలని, తమని ఆదుకోవాలని, తమకు అండగా నిలవాలని రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నట్టు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలొస్తున్నాయి.

అంటే కేవలం టీడీపీని టార్గెట్ చేయకుండా మిగతావాళ్లని కూడా ఇందులో భాగస్వాముల్ని చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. తన చేతికి మట్టి అంటకుండా బీజేపీ, జనసేనను కూడా ఇరికించి కేంద్రం దృష్టిలో పడాలనుకుంటున్నారు. అయితే అదంత సులభం కాదు. ఇప్పటికే ఈ వ్యవహారం నుంచి బీజేపీ చాకచక్యంగా తప్పుకుంది. ఇక జనసేన కూడా బయటకొచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినా బీజేపీతో పొత్తు కారణంగా అది టీడీపీకి దూరంగానే ఉంటుంది.

సో.. ఎలా చూసుకున్నా టీడీపీ నాయకులే బైటకు రావాల్సిన పరిస్థితి. దీంతో అనుకోకుండానే అమరావతి ఉద్యమానికి పసుపు రంగు అంటుకుంది. రాజధాని ఉద్యమాన్ని రైతు ఉద్యమంగా ప్రొజెక్ట్ చేయాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కావడంలేదు. బాబు వ్యూహం మార్చినా అది ఏమాత్రం వర్కవుట్ అయ్యేలా లేదు.

పవన్ కళ్యాణ్ తో నా ఎక్స్పీరియన్స్

కరోనా తగ్గిపోయింది