అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టాలీవుడ్ హీరో బాలకృష్ణకు ఏమైనా సంబంధం ఉందా? ఎక్కువగా ఆలోచించొచ్చు.. వీళ్లిద్దరికీ అస్సలు సంబంధం లేదు. కానీ ఒకే ఒక్క విషయంలో ఇద్దరి మధ్య పోలిక తీస్తున్నారు నెటిజన్లు. పైగా ట్రంప్ ఇండియాలో పర్యటిస్తున్న వేళ.. ట్రంప్ వర్సెస్ బాలయ్య అంటూ సరికొత్త చర్చకు తెరదీశారు కొందరు నెటిజన్లు.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈరోజు తాజ్ మహల్ ను సందర్శించారు ట్రంప్. అంతకంటే ముందు సబర్మతీ ఆశ్రమంలో రాట్నం తిప్పారు. ఈ రెండు సందర్భాల్లో అక్కడున్న రిజిస్టర్ లో ట్రంప్ సంతకం చేశారు. ఇప్పుడా సంతకం వైరల్ అయింది. నరమానవుడికి కూడా అర్థంకాని రీతిలో ట్రంప్ సంతకం ఉంది.
ఓ వైపు ఈ సంతకం వైరల్ అవుతుండగానే మరోవైపు బాలయ్య సంతకాన్ని తెరపైకి తీసుకొచ్చారు కొంతమంది. ట్రంప్ సంతకానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న బాలయ్య సంతకం చూడండంటూ అతడి సిగ్నేచర్ ఉన్న స్క్రీన్ షాట్స్ ను పోస్ట్ చేయడం ప్రారంభించారు.
ఇలా ట్రంప్, బాలయ్య సంతకాలు రెండూ సోషల్ మీడియాలో తెగ రౌండ్స్ కొడుతున్నాయి. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ట్రంప్-బాలయ్య సంతకాలు రెండూ అత్యంత క్లిష్టంగా ఉన్నాయి. వీటిని ఫోర్జరీ చేయడం ఎవరితరం కాదు. అందుకే ఈ విషయంలో ట్రంప్ కు మా బాలయ్య ఏమాత్రం తీసిపోడంటూ నందమూరి ఫ్యాన్స్ మరోసారి పండగ చేసుకుంటున్నారు. వాళ్లకు ఇదొక ఆనందం.