దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల అభిమానం నిండుగా పొందిన నాయకుడు. ఆయన ఉమ్మడి ఏపీని అయిదుంపావు ఏళ్ళ పాటు పాలించారు. సంక్షేమ సారధిగా వైఎస్సార్ చరిత్రలో సదా గుర్తుంటారు.
ఇదిలా ఉండగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రను వైఎస్సార్ అభిమాని నిర్వహించడం విశేషం. వైఎస్సార్ అమరజ్యోతి పాదయాత్ర బృందం అధ్యక్షుడు గాలి గణేష్ సింహాచలం టూ ఇడుపులపాయగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.
వైఎస్సార్ వర్ధంతి రోజు అయిన సెప్టెంబర్ 2 నాటికి ఇడుపుల పాయకు చేరుకుంటామని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా వైఎస్సార్ కి భారతరత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయలాని కూడా గణేష్ అంటున్నారు.
వైఎస్సార్ వంటి నాయకులు అరుదుగా పుడతారని ఆయన పేర్కొనడం విశేషం. ఈ పాదయాత్ర విజయవంతం కావాలని వైఎస్సార్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.