పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ రహస్య ఎజెండా

గతంలో పోలవరంపై కేంద్రం ఉత్సాహంగా ఉన్నా.. సొంత లాభం కోసం చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ ని, తన ఏటీఎంగా మార్చుకున్నారు. డైలీ సీరియల్ లా సాగదీశారు. ఎన్నేళ్లు నిర్మాణం కొనసాగితే, అన్నేళ్లపాటు జేబులు నింపుకోవచ్చనే…

గతంలో పోలవరంపై కేంద్రం ఉత్సాహంగా ఉన్నా.. సొంత లాభం కోసం చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ ని, తన ఏటీఎంగా మార్చుకున్నారు. డైలీ సీరియల్ లా సాగదీశారు. ఎన్నేళ్లు నిర్మాణం కొనసాగితే, అన్నేళ్లపాటు జేబులు నింపుకోవచ్చనే ఉద్దేశంతో దాన్ని అలా కొనసాగిస్తూ వచ్చారు బాబు. 

తీరా జగన్ హయాం వచ్చే సరికి పోలవరంపై బీజేపీ తన దృక్పథాన్ని మార్చుకుంది. వీలైతే దీన్ని తమ ఎన్నికల ప్రధానాస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై సీరియస్ గా దృష్టిపెట్టిన బీజేపీ.. ఏపీలో పాగా వేయడానికి పోలవరాన్ని మించిన ఆయుధం లేదని గుర్తించింది. 

మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా నుంచి ఏపీ ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే పోలవరం ప్రాజెక్టుకు మించిన అంశం మరొకటి లేదు. అందుకే ఎన్నడూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టుపై కొత్త మెలికలు పెడుతోంది కేంద్రం.

వైసీపీ హయాంలో పోలవరం పూర్తయితే కచ్చితంగా క్రెడిట్ జగన్ కే వెళ్తుంది. అందుకే నిధుల విషయంలో తకరారు మొదలు పెట్టింది. విభజన చట్టంలో ఉన్న ఈ హామీని పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అయినా, రాష్ట్ర ప్రభుత్వాలపై నెపం నెట్టి ఒకడుగు ముందుకేస్తే.. రెండడుగులు వెనక్కు లాగుతోంది.

2020 నాటికి బీజేపీ ఏపీ మేనిఫెస్టోలో పోలవరం ప్రధానాంశం కాబోతోంది. ప్రాజెక్ట్ పూర్తికావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండాలనే నినాదంతో ఆ పార్టీ శ్రేణులు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాయి. 

అప్పటికి టీడీపీని పూర్తిగా భ్రష్టుపట్టించి, తమ దయతో నాలుగు సీట్లు విదిలించి కూటమి కట్టినా, ఒకవేళ టీడీపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని బరిలో దిగినా.. పోలవరం మాత్రం బీజేపీ ప్రధాన అజెండాగా ఉండాలనేది కేంద్రంలోని పెద్దల దూరాలోచన. 

అందుకే ఆ జాతీయ ప్రాజెక్ట్ ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేందుకు డిసైడ్ అయింది. నిధుల్లో సగానికి సగం కోతకోసి తమాషా చూస్తోంది. గతంలో టీడీపీ వల్ల ఆలస్యం అవుతోన్న ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు బీజేపీ వల్ల వెనక్కి వెళ్లిపోతోంది. ఏపీ పొలిటికల్ గేమ్ కోసం బీజేపీ పోలవరాన్ని బ్రహ్మాస్త్రంలా దాచిపెడుతోంది. 

అసలే ఓటుకు నోటు కేసు విచారణకు వస్తోంది