వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మధ్య దూకుడు పెంచేశారు. ఆయన కూడా టైమ్ టైమింగ్ చూసుకుని మరీ బాగానే పంచులు పేల్చేస్తున్నారు. నిజానికి బొత్సలో ఈ యాంగిల్ ని చూసింది ఇప్పటిదాకా చాలా తక్కువే.
కానీ ఆయన కూడా సీన్ సిట్యువేషన్ చూసి మరీ తన స్టైల్ కంప్లీట్ గా మార్చేశారు అనుకోవాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పటికి చాలా మంది మంత్రులు గట్టిగానే మాట్లాడారు. అయితే బొత్స పేల్చిన డైలాగ్స్ మాత్రం ఒక రేంజిలో ఉన్నాయనే చెప్పాలి.
ఏం తేలుస్తాడు పవన్…గోంగూర కట్ట అంటూ బొత్స గట్టిగానే తగులుకున్నారు. అంతేనా పవన్ గత కొన్నేళ్ళుగా గొంతు చించుకోవడమే కాదు చొక్కాలు కూడా బాగానే చించుకుంటున్నాడని, కానీ రిజల్ట్ ఏంటి అంటూ కూడా అడిగేశారు, కడిగేశారు. ఇలాంటివి చాలానే విన్నాం లే అన్నట్లుగా బొత్స మార్క్ సెటైర్లు పవన్ మీద ఉన్నాయి.
తమకు పబ్లిసిటీ పిచ్చి లేదని, ప్రజా సేవ చేయడం ద్వారా వచ్చే ప్రచారాన్నే తాము నమ్ముకున్నామంటూ పవన్ కి బాగానే షాకిచ్చారు. మొత్తానికి చూస్తూంటే పవన్ కళ్యాణ్ ని వారూ వీరు అన్న తేడా లేకుండా వైసీపీ మంత్రులు అందరూ ఎవరి రేంజిలో వారు గట్టిగానే ఏసేస్తున్నారు అనుకోవాలి.