పుట్టకముందే ఆపరేషన్…?

ఏదీ అభివృద్ధి అని అడుగుతారు. తీరా అక్కడ ఏదైనా వస్తే చాలు కోర్టులకు ఎక్కుతారు. ఇదీ ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్న వాతావరణం. ఏపీలో 16 మెడికల్ కాలేజీలను కొత్తగా జగన్ సర్కార్ ఈ మధ్యనే…

ఏదీ అభివృద్ధి అని అడుగుతారు. తీరా అక్కడ ఏదైనా వస్తే చాలు కోర్టులకు ఎక్కుతారు. ఇదీ ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్న వాతావరణం. ఏపీలో 16 మెడికల్ కాలేజీలను కొత్తగా జగన్ సర్కార్ ఈ మధ్యనే ప్రారంభించింది.

అందులో విశాఖ జిల్లా అనకాపల్లికి కూడా వచ్చింది. ఆర్భాటంగా ప్రారంభం అయితే సాగింది. ఇంకా అసలు కధ చాలానే ఉంది. ఇక్కడ సూపర్ స్పెషల్ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే వ్య‌వసాయ పరిశోధన కేంద్రం స్థలంలో ఏర్పాటు చేశారు అన్న సాకుతో కొందరు వ్యతిరేకిస్తున్నారు. వారి వెనక ఎవరు ఉన్నారో తెలిసిందే. అక్కడ కాలేజ్ వద్దు, ఆసుపత్రి వద్దూ అంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. 

నిజానికి పట్టణం నడిబొడ్డున ఆసుపత్రి ఉంటే అందరికీ మేలు, అవసరం అనుకుంటే వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి కొంత స్థలం వేరే చోట చూపించవచ్చు. కానీ ఇపుడు గొడవ అంతా అక్కడ మెడికల్ కాలేజ్ కట్టవద్దు అని.

మరి దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలో మరి. అభివృద్ధి వద్దు అంటున్న తీరుకు నవ్వాలో బాధపడాలో అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి ప్రతీ దాని వెనకా రాజకీయం, ప్రతీ అడుగునూ ఆపే యత్నం. మరి ఇలాగైతే ప్రగతి ఎలా అంటున్నారు ఇదంతా చూస్తున్న మేధావులు.