కోడెలకు బాబు అపాయింట్ మెంట్ ఇవ్వలేదా?

కోడెల శివప్రసాద్ మరణంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయానికి పదునుపెట్టారు. కోడెల ఆత్మహత్య నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వ వేధింపులు సాగాయని, వాటివల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు…

కోడెల శివప్రసాద్ మరణంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయానికి పదునుపెట్టారు. కోడెల ఆత్మహత్య నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వ వేధింపులు సాగాయని, వాటివల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలకు అవకాశంగా మార్చుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అయితే కోడెల మరణించిన నేపథ్యంలో ఆయన మరణాన్ని చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కోడెల బతికి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ఆయనను ఎలా ట్రీట్ చేశారనేది చర్చనీయాంశంగా మారింది. కోడెల శివప్రసాద్ రావు కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. పార్టీ ఇమేజ్ ను పెంచుకోవాలని భావించారట లోకేష్.

ఐదేళ్ల పాలనలో వచ్చిన చెడ్డపేరు పోవాలంటే కొందరిపై చర్యలు తీసుకున్నట్టుగా ఉన్నారని, అప్పుడు ఇమేజ్ పెరుగుతుందని.. అందుకు దెబ్బలబ్బాయిగా కోడెల కుటుంబాన్ని వాడుకోవాలని లోకేష్ అనుకున్నారట. ఆ రాజకీయం అమలవుతున్న దశలోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇక కోడెలకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. గత కొన్నాళ్లుగా చంద్రబాబును కలిసేందుకు కోడెల ప్రయత్నాలు సాగించినట్టుగా సమాచారం. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదట.

అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో కోడెల ఇమేజ్ బాగా డ్యామేజ్ కావడంతో చంద్రబాబు నాయుడు ఆయనను కలవడానికి ఇష్టపడలేదట. చంద్రబాబు నాయుడు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో కోడెల మరింత నిస్పృహలోకి జారినట్టుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

బతికి ఉన్నప్పుడు అపాయింట్ మెంట్ ఇవ్వని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కోడెల మరణాన్ని మాత్రం రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

గ్రేట్ ఆంధ్ర ఈవారం స్పెషల్ బిగ్ స్టోరీ