అన్యాయాన్ని ప్ర‌శ్నించేందుకే పోటీ

క్షేత్ర‌స్థాయిలో బ‌లాబ‌లాల‌తో సంబంధం లేకుండానే ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే పార్టీల‌ను చూస్తుంటాం. ఇప్పుడు ఆ జాబితాలోకి జాతీయ పార్టీ కాంగ్రెస్ చేరింది.  Advertisement ఏపీ విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ఏపీలో…

క్షేత్ర‌స్థాయిలో బ‌లాబ‌లాల‌తో సంబంధం లేకుండానే ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే పార్టీల‌ను చూస్తుంటాం. ఇప్పుడు ఆ జాబితాలోకి జాతీయ పార్టీ కాంగ్రెస్ చేరింది. 

ఏపీ విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ఏపీలో ఏ మాత్రం ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జాక్షేత్రంలో మొక్కుబ‌డి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ ఉనికి చాటుకునేందుకు య‌త్నిస్తున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య ఆక‌స్మిక మృతితో క‌డ‌ప జిల్లా బ‌ద్వేలులో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఏపీలో ప్ర‌జాబ‌లం ఉన్న టీడీపీ, జ‌న‌సేన ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకున్నాయి. 

కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తాము ఉన్నామంటూ మాట‌ల తూటాలు పేల్చుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు సాకే శైలజనాథ్ బ‌ద్వేలులో పోటీపై స్ప‌ష్ట‌త ఇచ్చారు.

బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని శైలజనాథ్‌ స్పష్టం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడానికి పోటీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. స్థానిక ఎన్నికల్లో కడప జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగాయో చూశామన్నారు. 

బీజేపీని ప్రశ్నించలేని అసమర్థతలో ఏపీ ప్రభుత్వం ఉందని విమ‌ర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి బద్వేలులో కాంగ్రెస్ పోటీ చేస్తోంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఏపీలో పరిపాలన రోజు రోజుకీ దారుణంగా మారుతోందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అప్పుల‌తో రాష్ట్రాన్ని నెట్టుకొస్తోంద‌న్నారు.