వేయి పడగల విశాఖ!

విశాఖపట్నం ఇపుడు అసలైన ప్రమాదంలో పడింది. ఇపుడు జనాలకు వణుకు పుడుతోంది. ఇది హుదూద్ తుఫానో, సునామీ లాంటి బినామీ వార్తో కాదు, యావత్తు లోకాన్ని భయపెట్టే కరోనా మహమ్మారి వీర విహారం. Advertisement…

విశాఖపట్నం ఇపుడు అసలైన ప్రమాదంలో పడింది. ఇపుడు జనాలకు వణుకు పుడుతోంది. ఇది హుదూద్ తుఫానో, సునామీ లాంటి బినామీ వార్తో కాదు, యావత్తు లోకాన్ని భయపెట్టే కరోనా మహమ్మారి వీర విహారం.

విశాఖ ఇన్నాళ్ళూ ఓ మాదిరిగా ఉండే కేసులు గత ఇరవై నాలుగు గంటల్లో ఒక్కసారిగా రెచ్చిపోయి వేయి దాటేశాయి. ఏకంగా 1049 కేసులు స్మార్ట్ సిటీలో నమోదు కావడం బెంబేలెత్తించే పరిణామమే. ఒక విధంగా విశాఖలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయనిపిస్తోంది. దేశంలోని ఇతర మెట్రో సిటీల్లో వేలకు వేలు కేసులు వచ్చిన వేళ కూడా విశాఖలో ఎపుడూ గట్టిగా వంద కేసులు కూడా రాలేదు.

ఇక గత వారంగా చూస్తే రోజుకు రెండు వందల వరకూ కేసులు వస్తూంటేనే జనానికి టెన్షన్ మొదలైంది. అది కాస్తా ఇపుడు ఒక్కసారిగా  వేయి పడగలెత్తేయడంతో విశాఖ బ్లాస్ట్ అవుతోందా అన్న అనుమానాలను వైద్య‌ నిపుణులు కూడా  వ్యక్తం చేస్తున్నారు.

విశాఖలో పెద్ద ఎత్తున మురికివాడలు ఉండడంతో పాటు, అనేక చోట్ల వలసలు, రాకపోకలు చోటు చేసుకోవడంతో కేసులు బాగా పెరుగుతున్నాయని అంటున్నారు. మరో వైపు పరీక్షలు పెద్ద ఎత్తున జరగడం వల్ల కూడా కేసులు తేలుతున్నాయన్న వాదన ఉంది. ఏది ఏమైనా విశాఖలో కరోనా మహమ్మారి బలంగానే ఉనికి చాటుకుంటోందని తాజా పరిణామాలు చెబుతున్నాయి.

పొరుగున ఉన్న శ్రీకాకుళం, విజయనగరంలో అపుడే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. విశాఖలో కూడా లాక్ డౌన్ పెడతారు అన్న మాట కూడా ఉంది. మొత్తం మీద చూసుకుంటే కరోనా కర్కశత్వంలో ప్రశాంత విశాఖలో కల్లోలం రేగుతోంది.

జగనన్నని అడిగి నర్సాపురం సీటు తెచుకుంటా

ఆర్జీవీ చాలా తెలివైనోడు