విధి ఆడిన వింత నాట‌కం

విధి రాత‌ను త‌ప్పించుకోలేరంటే ఇదో కాబోలు. క‌ల‌క‌త్తాలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి తిరిగి వస్తుండగా….రోడ్డు ప్ర‌మాదం వారిని ఎవ‌రికీ అంద‌నంత సుదూరాల‌కు తీసుకెళ్లింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఒక…

విధి రాత‌ను త‌ప్పించుకోలేరంటే ఇదో కాబోలు. క‌ల‌క‌త్తాలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి తిరిగి వస్తుండగా….రోడ్డు ప్ర‌మాదం వారిని ఎవ‌రికీ అంద‌నంత సుదూరాల‌కు తీసుకెళ్లింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఒక ఏఎస్ఐ, మ‌రో ముగ్గురు ఏఆర్ పోలీసుల ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. శ్రీ‌కాకుళం జిల్లాలో జ‌రిగిన ఈ ఘోర దుర్ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి.

క‌ల‌క‌త్తాలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ను భైరిసారంగపురంలో ఉన్న ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. కుటుంబ స‌భ్యుల్ని ఓదార్చారు. అనంత‌రం బొలెరో వాహనంలో తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. పలాస మండలం సున్నాదేవి జాతీయ రహదారిపై వెళ్తుండ‌గా వారు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం టైరు పేలింది. దీంతో వాహ‌నం అదుపు త‌ప్పి ప‌క్క‌నే ఉన్న డివైడ‌ర్‌ను ఢీకొట్టింది.

ఈ దుర్ఘ‌ట‌న‌లో పోలీస్‌శాఖ‌కు చెందిన న‌లుగురు దుర్మ‌ర‌ణం పాలయ్యారు. మృతుల్లో ఏఆర్ ఏఎస్ఐ కె.కృష్ణుడు, హెడ్ కానిస్టేబుళ్లు వై. బాబూ రావు, పి. ఆంటోనీ, డ్రైవర్‌ పి. జనార్దనరావు ఉన్నారు. జ‌వాను మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేసేందుకు వెళ్లి… తాము శ‌వాలవుతామ‌ని వారు క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌రు. 

అలాంటిది ఆ పోలీసులు విధి ఆడిన వింత నాట‌కంలో ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్, డీజీపీ గౌతం స‌వాంగ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.