రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు!

ఉన్నట్టుండి సడెన్ గా హాస్పిటల్ లో చేరారు సూపర్ స్టార్ రజనీకాంత్. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసం మాత్రమే ఆయన హాస్పిటల్ కు వచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ హాస్పిటల్ నుంచి…

ఉన్నట్టుండి సడెన్ గా హాస్పిటల్ లో చేరారు సూపర్ స్టార్ రజనీకాంత్. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసం మాత్రమే ఆయన హాస్పిటల్ కు వచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ హాస్పిటల్ నుంచి వస్తున్న లీకులు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆయనకు కాస్త సీరియస్ గా ఉందంటూ కథనాలు వస్తున్నాయి.

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో సమస్య ఉందంట. ఆ నాళాల్లో టిష్యూలు దెబ్బతిన్నాయని, దానికి సంబంధించి రజనీకాంత్ కు ట్రీట్ మెంట్ అందిస్తున్నారని సమాచారం. అయితే రజనీకి సన్నిహితులైన మహేంద్రన్ లాంటి వాళ్లు మాత్రం రజనీకాంత్ బాగానే ఉన్నారని ముక్తాయింపు ఇస్తున్నారు.

కొన్నేళ్లుగా రజనీకాంత్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. విదేశాల్లో ఆయన ట్రీట్ మెంట్ కూడా పూర్తిచేసుకొని వచ్చారు. కేవలం అనారోగ్య కారణాల వల్లనే ఆయన రాజకీయాలకు కూడా దూరమయ్యారు. పార్టీ పెడతానని ప్రకటించి మరీ తప్పుకున్నారు.

అలా రాజకీయాలకు దూరంగా ఉన్న రజనీకాంత్, వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అంతలోనే ఆయన మరోసారి అనారోగ్యానికి గురైనట్టు వార్తలొస్తున్నాయి. రజనీకాంత్ నటించిన అన్నాత్తై (తెలుగులో పెద్దన్న) సినిమా దీపావళి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది.