అమరావతి భూముల కుంభకోణంలో విచారణ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగనున్నదని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై ఈడీ విచారణ ప్రారంభం కాబోతోందని సమాచారం. ఇప్పటికే ఈ కుంభకోణంలో సీఐడీ విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఐడీ విచారణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
దాదాపు నాలుగు వేల ఎకరాల భూమి కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా సీఐడీ నిర్ధారించినట్టుగా సమాచారం. భూములు కొనుగోలు చేసిన రాజకీయ నేతల మీద కూడా సీఐడీ కన్నేసినట్టుగా తెలుస్తోంది.
790 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు భూములు కొనుగోలు చేసినట్లు కూడా సీఐడీ గుర్తించినట్టుగా సమాచారం. కోర్ ఏరియాలో 720 ఎకరాల భూమిని వైట్ రేషన్ కార్డు హోల్డర్లే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై విచారణ చేయాలని ఈడీని సీఐడీ కోరినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో భారీ ఎత్తున మనీలాండరింగ్ కూడా జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది సీఐడీ. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో అమరాతి భూముల కుంభకోణంపై ఈడీ విచారణ మొదలు కానుందని సమాచారం.