అప్పుడు అలిపిరి, ఇప్పుడు భువనేశ్వరి.. ఇది హిస్టరీ

మొత్తానికి చంద్రబాబు ఓ ఇష్యూనైతే పట్టగలిగారు. దాని చుట్టూ ఎంత మంట రగల్చాలో అంతా చేశారు. తొలిసారి మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సింపతీ…

మొత్తానికి చంద్రబాబు ఓ ఇష్యూనైతే పట్టగలిగారు. దాని చుట్టూ ఎంత మంట రగల్చాలో అంతా చేశారు. తొలిసారి మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సింపతీ చంద్రబాబుకు కలిసొస్తుందా? మరోసారి ఆయనకు అధికారం అందిస్తుందా? ఈ కన్నీటి ఖరీదు ఎంత?

చంద్రబాబుకు ఎప్పుడూ సింపతీ రాజకీయాలు కలిసిరాలేదు. గతంలో ఏకంగా మావోయిస్టుల దాడి జరిగినప్పుడే ప్రజలు చంద్రబాబుపై సింపతీ చూపించలేదు. కాబట్టి ఇప్పుడీ కన్నీళ్లకు కరుగుతారని అనుకోలేం. 2003లో అలిపిరి వద్ద చంద్రబాబుపై నక్సలైట్లు దాడిచేశారు. ఆ దాడి జరిగిన కొన్ని నెలలకే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు బాబు. 

తనపై జరిగిన దాడి నుంచి సింపతీ కొట్టేసి తిరిగి సీఎం అయిపోవాలనుకున్నారు. రక్తంతో తడిసి ముద్దయిన దుస్తులతో కారు నుంచి బయటకొచ్చిన ఫొటోల్ని ఆ ఎన్నికల్లో అడుగడుగునా వాడారు. కానీ సింపతీ పనిచేయలేదు. వైఎస్ఆర్ హవా ముందు చంద్రబాబు నాటకాలు రక్తికట్టలేదు.

ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు చంద్రబాబుకు మరో సింపతీ డ్రామా దొరికింది. వెక్కివెక్కి ఏడ్చేశారు. వచ్చే ఎన్నికల వరకు ఈ ఏడుపును అలానే కొనసాగించాలనుకుంటున్నారు. అయితే ఈసారి ఉన్నది వైఎస్ఆర్ ను మించిన నేత, అతడి తనయుడు వైఎస్ జగన్. పైగా ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉంది. 

కాబట్టి ఈసారి కూడా చంద్రబాబు సింపతీ డ్రామా వర్కవుట్ అవ్వకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ పాలన ముందు, ఆయన రాజకీయ ఎత్తుల ముందు చంద్రబాబు నిలబడలేరని చెబుతున్నారు. సో.. బాబు కన్నీటి ఖరీదు సున్నా.

సింపతీలకు పడిపోయే రోజులు కావివి..

ఒకవేళ సింపతీకే ప్రజలు పడిపోతారనుకుంటే.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తనపై రాళ్లదాడి జరిగిందని చంద్రబాబు చేసిన రచ్చకి కాస్తో కూస్తో ఓట్ల శాతం పెరిగేది, కానీ అది జరగలేదు. ఇటీవల కుప్పం వచ్చి నాకింత అవమానం జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా అంటూ రెచ్చిపోయారు, వంగి వంగి దండాలు పెట్టారు. అప్పుడూ ఎవరూ కరగలేదు.

ఇప్పుడు అంతకంటే పెద్దగా ఏడ్చేశారు బాబు. ఈ కన్నీళ్లకు ఎవరు కరుగుతారు..? అందులోనూ చంద్రబాబు ఏడిపించేవారే కానీ, ఏడ్చేవారు కాదనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అందుకే బాబు కన్నీళ్లకు అసలు విలువే లేదు. ఏడుపుగొట్టు డ్రామాలకు ఓట్లు రాలవని బాబు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో..?