ఏయూలో ఫిల్మ్ అకాడమీ ?

విశాఖను పాలనా రాజధానిగా జగన్ ప్రతిపాదించారు. ఆ మేరకు చట్టాన్ని కూడా తీసుకువచ్చారు. ప్రస్తుతం అది న్యాయ సమీక్షలో ఉంది. ఇదిలా ఉంటే విశాఖకు ఉన్న బిరుదులు అన్నీ ఇన్నీ కావు. విశాఖ అనగానే…

విశాఖను పాలనా రాజధానిగా జగన్ ప్రతిపాదించారు. ఆ మేరకు చట్టాన్ని కూడా తీసుకువచ్చారు. ప్రస్తుతం అది న్యాయ సమీక్షలో ఉంది. ఇదిలా ఉంటే విశాఖకు ఉన్న బిరుదులు అన్నీ ఇన్నీ కావు. విశాఖ అనగానే సినీ రాజధాని అని చెబుతారు.

ఇక్కడ ఉన్న ప్రకృతి రమణీయత అటువంటిది. అన్నింటికీ మించి అందమైన బీచ్ విశాఖ సొంతం. ఎత్తైన నల్లని కొండలు కూడా విశాఖకు తరగని ఆస్తి. దాంతో విశాఖను సినీ హబ్ గా మార్చాలన్న తాపత్రయం ఏనాటి నుంచో సాగుతోంది.

రాష్ఱ విభజన నేపధ్యంలో విశాఖలో షూటింగులు జరుగుతాయా, ఫిల్మ్ యాక్టివిటీ పెరుగుతుందా అన్నది ఒక వైపు చర్చగా ఉంటే విశాఖలోని పురాతమైన ఆంధ్రా యూనివర్శిటీలో ఫిల్మ్ అకాడమీని ఏర్పాటు చేస్తారు అన్న మాట వినిపిస్తోంది. ఉత్తరాంధ్రా జిల్లాలలో నిండా కళాకారులు ఉన్నారు.

వారికి సరైన శిక్షణను ఇచ్చి ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దడానికి సరైన నట శిక్షణాలయం అయితే లేదు. ఆ విషయంలో ప్రైవేట్ వ్యక్తులు చాలా మంది ప్రయత్నాలు చేసినా కొలిక్కి రాలేదు. ఇపుడు ఏయూ ఆ పనిలో బిజీగా  ఉందని అంటున్నారు. దానికి కారణం ఉంది. 

విశాఖ జిల్లాకే చెందిన నటుడు, యాంకర్ జోగినాయుడు ఏయూ వీసీ ప్రసాదరెడ్డిని తాజాగా కలసి ఫిల్మ్ అకాడమీ స్థాపించాలని కోరారు. మరి సినీ వర్గాల మద్దతుతోనే ఏయూ ఈ అకాడమీని స్థాపిస్తుంది అంటున్నారు. అదే జరిగితే విశాఖ సినీ రాజధానికి తొలి అడుగు పడినట్లే.