Advertisement

Advertisement


Home > Politics - Gossip

భక్తుల్లో తేడాలు తుడిచిపెట్టేస్తున్న టీటీడీ

భక్తుల్లో తేడాలు తుడిచిపెట్టేస్తున్న టీటీడీ

తిరుపతి తిరుమల దేవస్థానం ట్రస్టుబోర్డు మరో ప్రశంసనీయమైన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ప్రసాదాల్లో సిఫారసు ఉత్తరాలకు మాత్రం దొరికే వడ ప్రసాదాన్ని ఇకమీదట భక్తులందరికీ లడ్డూ కౌంటర్ల వద్దనే విక్రయించడానికి నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వీఐపీలు, సిఫారసు ఉత్తరాలు పుట్టించుకోలిగిన ప్రముఖులు- సామాన్య భక్తులకు మధ్య ఉండే అంతరాల్ని తొలగించడానికి తితిదే ఒక మంచి ప్రయత్నం చేసినట్లు అయింది.

తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో లడ్డూకు ఉన్న ప్రాముఖ్యం యిక దేనికీ లేదు. అంటే అలా అని అనలేం గానీ.. మిగిలిన ప్రసాదాల గురించి సామాన్యభక్తులకు తెలియను కూడా తెలియదు. కేవలం సిఫారసు ఉత్తరాలు తెచ్చుకునే వారికి, పైరవీలు చేసుకునే వారికి మాత్రం దొరుకుతూ ఉంటాయి. అలాంటి వాటిలో పెద్దలడ్డూ, వడ వంటి ప్రసాదాలు ఉన్నాయి.

వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ అయిన తరువాత.. వీఐపీ భక్తులకు- సామాన్య భక్తులకు మధ్య అంతరాలు చెరిపేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి మంచి ప్రయత్నాల్లో భాగంగా.. పెద్దలడ్డూలను కూడా సామాన్యులకు విక్రయించే పద్ధతిని కొన్ని రోజుల కిందటే తీసుకువచ్చారు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటి రెండు వందల రూపాయల వంతున.. లడ్డూ కౌంటర్లలోనే విక్రయిస్తున్నారు. కాగా, వడ ప్రసాదం ఒక్కటీ కేవలం వీఐపీలకు మాత్రం దక్కేలా మిగిలిపోయింది.

అయితే బుధవారం నాడు మరో  మంచి నిర్ణయం తీసుకున్నారు. వడ ప్రసాదాన్ని కూడా సామాన్య భక్తులకు విక్రయించాలని నిర్ణయించారు. గురువారం నుంచి వడ ప్రసాదం.. వందరూపాయల వంతున అందరికీ అందుబాటులో ఉంటుంది. సామాన్య భక్తులు ఎవరైనా సరే.. తమకు కావాల్సినన్ని వడలు, పెద్ద లడ్డూలు కూడా తీసుకోవచ్చు.

అయితే ఇలాంటి చర్యలన్నీ.. దళారీల పాత్రకు కత్తెర వేసే మంచి నిర్ణయాలుగా అభివర్ణించాలి. అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నందుకు వైవీ సుబ్బారెడ్డి  నాయకత్వాన్ని అభినందించాలి కూడా. ఇలాంటివే మరిన్ని నిర్ణయాలు వస్తే గనుక.. తిరుమలలో వీఐపీ భక్తులు- సామాన్యులు అనే అంతరాలు పూర్తిగా సమసిపోతాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?