cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఆ జిల్లాలో టీడీపీకి ఐదు పోతాయని క్లారిటీ వచ్చిందట!

ఆ జిల్లాలో టీడీపీకి ఐదు పోతాయని క్లారిటీ వచ్చిందట!

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన జిల్లా అనంతపురం. పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్న ఈ జిల్లాలో టీడీపీకి పన్నెండు సీట్లు వచ్చాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేవలం రెండుసీట్లకు పరిమితం అయ్యింది. ఈ జిల్లాలో రుణమాఫీ హామీ గట్టిగా పనిచేసింది. వరస కరువుల బారినపడిన అనంతపురం జిల్లాలో రుణమాఫీ అనేసరికి టీడీపీకి భారీఎత్తున ఓట్లుపడ్డాయి. ఇక పవన్‌ కల్యాణ్‌ మద్దతు కూడా కొంతవరకూ ఉపకరించింది.

పవన్‌ మద్దతు వల్ల బలిజలు టీడీపీ వైపు నిలబడ్డారు. అలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని కాంగ్రెస్‌గానే భావించడం.. టీడీపీ వైపు ఒకసారి చూద్దాం అన్నట్టుగా జనాలు అనుకోవడం కూడా టీడీపీ లాభించింది. ఇలాంటి పరిణామాల మధ్యన గత ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ పన్నెండు సీట్లను నెగ్గింది.

ఇక  ఐదేళ్లు కావొస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. తమ జిల్లాలో ఈసారి టీడీపీ గత ఎన్నికల్లో నెగ్గినట్టుగా నెగ్గలేదని స్వయంగా టీడీపీ నేతలు అంటున్నారు. సిట్టింగు ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అనేది బాగా వినిపిస్తున్న మాట.

అలాగే రుణమాఫీ సరిగా జరగకపోవడం, డ్వాక్రా రుణమాఫీ విషయంలో చంద్రబాబు పూర్తిగా చేతులు ఎత్తేయడం వంటి కారణాలతో టీడీపీకి ఎదురుదెబ్బ తగలవచ్చని అంచనా. జేసీ దివాకర్‌ రెడ్డి వంటినేత మాటల్లో చెప్పాలంటే.. ఎనిమిది మంది సిట్టింగులు ఓడిపోయే అవకాశాలున్నాయి.

ఇటీవలే చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించాడు. ఆ సందర్భంగా నిర్వహించిన సమీక్షల్లో కూడా ఈ విషయంలో ఒక ఒపీనియన్‌కు వచ్చారట. పన్నెండు మంది సిట్టింగుల్లో ఐదుమంది తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని బాబు తేల్చిచెప్పాడట.

పన్నెండులో ఐదు మందికి ఓటమి తప్పదనే విశ్లేషణలే చేశారట. ఆ ఎమ్మెల్యేల తీరు వల్ల, అక్కడ నెలకొన్న వర్గ విబేధాల వల్ల వాళ్లకు ఓటమి తప్పదని విశ్లేషించారట. ఈ ఐదు మందినీ మార్చాలనేది చంద్రబాబు భావనగా తెలుస్తోంది. మరి అది సాధ్యం అవుతుందా అనేది ప్రశ్నార్థకమే.

అభ్యర్థులను మార్చినంత మాత్రాన టీడీపీ ఇమేజ్‌ మారిపోతుందా అనేది కూడా గమనించాల్సిన విషయమే! ఖాయంగా పోయే ఐదు సీట్లలో శింగనమల, పుట్టపర్తి, గుంతకల్‌, అనంతపురం అర్బన్‌, కల్యాణదుర్గం సీట్లు ఉన్నాయని అంటున్నారు.

ఇక కదిరిలో కూడా టీడీపీ మళ్లీ కష్టమే అనేది జనంమాట. ఇక్కడ ఫిరాయింపు రాజకీయాలు టీడీపీని దెబ్బతీసే అవకాశాలున్నాయి. అయినా టీడీపీ లెక్కల్లోనే ఐదుపోతాయని తేలిదంటే.. వాస్తవం ఇంకా కఠినంగా ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు.

వైసీపీ మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా దూకుడుగా పనిచేస్తోందని.. చంద్రబాబు చెబుతున్నట్టుగా వ్యతిరేకత ఉన్నది కేవలం ఎమ్మెల్యేల మీదే కాదు, బాబు మీద కూడా వ్యతిరేకత ఉందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే కాంగ్రెస్‌తో చేతులు కలపడం కూడా అనంతపురం వంటి చోట టీడీపీకి మైనస్‌ పాయింటే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

తెలంగాణ ఓటరు నాడి... ముళ్లు ఎటువైపు తిరుగుతోంది?... చదవండి గ్రేట్ ఆంధ్ర పేపర్