cloudfront

Advertisement


Home > Politics - Gossip

జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి?

జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి?

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాయనే  ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమంచి గత ఎన్నికల్లో నవోదయం పార్టీ అభ్యర్థిగా నెగ్గారు. దాదాపుగా స్వతంత్రుడిగా నెగ్గినట్టే. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున మళ్లీ పోటీచేస్తే నెగ్గడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన ఈయన ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ మేరకు అనుచరవర్గంలో చర్చలు జరుపుతూ ఉన్నాడట. త్వరలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాకు సమర శంఖారావం కార్యక్రమం కోసం వెళ్లబోతున్నారు. ఆ రోజున ఆమంచి వైఎస్సార్సీపీలోకి చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఒక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కడపజిల్లాకు చెందిన మేడా మల్లిఖార్జున రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారీఎత్తున అనుచరగణంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే అదేరూటులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇలాంటి వారు బయటకు వస్తారో!

వైసీపీ ఆయాకోణాల్లో ఆత్మసమీక్ష చేసుకోవాలి