cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఆమంచిని బుజ్జగిస్తున్న మంత్రి!

ఆమంచిని బుజ్జగిస్తున్న మంత్రి!

తెలుగుదేశం పార్టీని వీడబోతున్నాడన్న ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను ఆ పార్టీ బుజ్జగిస్తోంది. ఇందుకోసం ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్ధా రాఘవరావు రంగంలోకి దిగారు. ఆమంచి సొంతూర్లో అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ఈయన అక్కడకు చేరుకుని.. ఆమంచిని బుజ్జగించే యత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఆమంచిని ఎలాగైనా తెలుగుదేశంలోనే నిలుపుకోవాలని ఆ పార్టీ భావిస్తోందని వేరే చెప్పనక్కర్లేదు. ఆ ఉద్దేశంతోనే శిద్ధా రాఘవరావు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో దాదాపుగా ఇండిపెండెంట్ గానే నెగ్గారు ఆమంచి. ఇలాంటి నేపథ్యంలో ఇతడిని తెలుగుదేశం వదులుకోకపోవచ్చు.

గత కొన్నాళ్లుగా ఆమంచి తెలుగుదేశం పార్టీని వీడే దిశగానే సాగుతున్నారు. ఇటీవలే దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కూడా ఆమంచి భేటీ అయ్యారు. ఇప్పుడు అనుచరులతో సమావేశం నేపథ్యంలో.. ఈయన టీడీపీని వీడటానికే సిద్ధం అయినట్టే అంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మంత్రిగారి బుజ్జగింపులు ఏ మేరకు పని చేస్తాయో చూడాలి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి కోల్ కతాకూ తిరుగుతూ ఉంటే.. ఇవతల ఎమ్మెల్యేలు మాత్రం తెలుగుదేశాన్ని వీడుతూ ఉండటం గమనార్హం.

వైసీపీ ఆయాకోణాల్లో ఆత్మసమీక్ష చేసుకోవాలి