cloudfront

Advertisement


Home > Politics - Gossip

పాపం గుత్తా.. ఎంత కష్టం వచ్చిందో?

పాపం గుత్తా.. ఎంత కష్టం వచ్చిందో?

తెలంగాణలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకడు, పారిశ్రామికవేత్త గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రిగా పనిచేయాలనేది కోరిక. కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచినప్పటికీ.. తర్వాత తెరాసలోకి ఫిరాయించిన ఈ నాయకుడు... కేసీఆర్ మీద బాగా ఒత్తిడి చేసి మంత్రిహోదా ఉండే నామినేటెడ్ పదవిని దక్కించుకున్నారు. కానీ రాబోయే ఎన్నికల్లో డైరక్టుగా మంత్రే కావాలన్నది కల. కాకపోతే... ఆర్థికంగా ఎంత ఖర్చుకైనా వెనుకాడని స్థాయిలో పుష్కలమైన సంపద వనరులు ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ్యుడిగా సభలో ప్రవేశించడానికి కేసీఆర్ గట్టి పరీక్షే పెడుతున్నారని తెలుస్తోంది.

గుత్తా సుఖేందర్ రెడ్డి.. కేవలం సంపన్న నాయకుడు మాత్రమేకాదు.. వ్యూహాత్మకంగా చూస్తే.. కాంగ్రెస్ శ్రేణులను కూడా తనవైపు తిప్పుకోగల నాయకుడు. ఒకప్పుడు కాంగ్రెస్ నేతే గనుక.. అది ఆయనకు ఈజీనే. ఇలాంటి వ్యూహంతోనే.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోటీగా గుత్తా సుఖేందర్ రెడ్డిని మోహరించడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఉత్తమ్ కుమార్ మీద పోటీచేయడానికి మాత్రం గుత్తా విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తెరాసను ఓడిస్తా.. కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తా అంటూ పలుమార్లు పలుకుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గట్టిగానే ఫోకస్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లుంది. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ తో పాటు ఆయన భార్య పద్మావతి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉత్తమ్ ను దెబ్బకొట్టాలంటే.. ఈ ఇద్దరినీ ఓడించాలనేది కేసీఆర్ ప్లాన్.

అందుకే దీటైన అభ్యర్థిగా గుత్తాను రంగంలోకి దింపదలచుకుంటే.. ఉత్తమ్ మీద పోటీకి ఆయన వెనుకాడినట్లు తెలుస్తోంది. అదే ఉత్తమ్ శ్రీమతి పద్మావతి మీద కోదాడలో పోటీచేయడానికి మాత్రం సై అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చూడబోతే.. పీసీసీ చీఫ్ స్థానంలో ఉన్న బలమైన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీకి గుత్తా సుఖేందర్ రెడ్డి జంకుతున్నాడేమో అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఒకవేళ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రెండు స్థానాల్లోనూ పోటీకి విముఖంగా ఉంటే ఆయనకే ఇబ్బంది అని పార్టీ వర్గాలు అంటున్నాయి. మంత్రిపదవి మీద బోలెడు ఆశ ఉన్న గుత్తా.. ఉత్తమ్ ను ఢీకొనడానికి భయపడుతూ.. కోదాడ వెళ్తానంటోంటే.. పాపం, ఆయనకు ఎంత కష్టం వచ్చిందో కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.