cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఆలీ రూటు పాత రూటే !

ఆలీ రూటు పాత రూటే !

రెండు రోజుల క్రితం చిన్న కుదుపు. పాపులర్ కమెడియన్ ఆలీ వైకాపాలో చేరుతున్నారంటూ వార్తలు. పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడు. ఎప్పటి నుంచో తెలుగుదేశంలో చేరే ఆలోచనలో వున్నారని వార్తలు వినిపించిన నేపథ్యం. అలాంటిది వైకాపాలో చేరతారా? అన్న అనుమానం. ఆయన స్వస్థలం రాజమండ్రి. మరి అక్కడ సీటు ఆలీకి తేదేపాలో కష్టం కావచ్చు అందువల్లే వైకాపా వైపు చూస్తున్నారేమో? అన్న డిస్కషన్లు.

అలా అయితే జనసేన తరపున పోటీ చేయవచ్చు కదా? వైకాపా ఎందుకు? అన్న కౌంటర్లు. జనసేన-తేదేపా అనేవి పార్టీలుగా వేరు వేరుకానీ, ఎప్పటికైనా ఒకటే కదా? అంతా రాజకీయ డ్రామా కదా అని మళ్లీ కౌంటర్ల మీద కౌంటర్లు. ఇలావుంటే ఇప్పుడు అసలు కథ మొదలయింది. ఆలీ వెళ్లి తేదేపా అధక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసారు.

హమ్మయ్య. ఓ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఆలీ రాజకీయ ప్రవేశం ఖరారు అయినట్లే అనుకోవాలి. అది కూడా ఎప్పటి నుంచో వినిపిస్తున్న తెలుగుదేశం పార్టీ నుంచే అనుకోవాలి. కానీ మిగిలినపోయిన అనుమానం ఒకటే.

అసలు వైకాపా వైపు ఎందుకు మొగ్గు చూపారు.? అసలు మొగ్గు చూపారా? అలా గ్యాసిప్ లు రప్పించి, ఇట్నుంచి పిలుపు వచ్చేలా చూసుకున్నారా? లేక నిజంగానే వెళ్లాలనుకుంటే, బాబుగారు చక్రం తిప్పి, ఇటు రప్పించారా?

మొత్తానికి ఏమైతేనే, ఏదో జరిగింది. ఆలీ పవన్ కు మరీ ఎక్కువ దూరం వెళ్లకుండా, ఆయనకు సన్నిహితమైన పార్టీలోనే చేరుతున్నారన్నమాట.

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

మహిళా మంత్రికి సలహాలు.. పోటీ చేయకమ్మా డబ్బులు మిగులుతాయ్